calender_icon.png 22 February, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం ఎగుమతులకు మార్గాలేమిటి?

22-02-2026 02:28:05 AM

  1. తెలంగాణ బియ్యం దిగుమతి చేసుకునే వివిధ దేశాల ప్రతినిధులతో త్వరలో సమావేశం 
  2. కొనుగోళ్లు, విక్రయాలలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలి -
  3. సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి):  ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభు త్వం కొను గోలు చేసిన 72 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు మార్గాలు అన్వేషించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ బియ్యానికి ఉన్న గుర్తింపునకు తగినట్లు ఎగుమతులు పెంచేలా చర్య లు చేపట్టాలని సూచించారు.

అదే క్రమంలో రాష్ట్రంలో ధాన్యం విక్రయాలు, ధాన్యం ఎగు మతులకు  మార్గాలేమిటి? కొనుగోళ్లలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిం చేందు కు ప్రణాళికలు రూపొందించా లన్నారు. శనివారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్రం లో పెరుగుతున్న ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా కేంద్రం కొనుగోళ్లు పెంచాలని సూచించారు.

కేంద్రం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని రాష్ట్రం ఎప్పుడో అధిగమించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు అందిస్తున్న బోనస్ కలిపి 19,500 వేల కోట్లు ఖర్చు చేయగా నిల్వపై చెల్లించిన వడ్డీ కలుపుకుంటే మొత్తం 25,000 వేల కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన వివరించారు. 2025 నాటికి భారతదేశం రికార్డు స్థాయిలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకుందన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ వాటా 10 నుంచి 11 శాతం ఉంటుందన్నారు.

బి య్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషే ధం ఎత్తివేసిన మీదట అంతర్జాతీయ మార్కె ట్లో ధరలు గణనీయంగా పడిపోయాయన్నారు. బ్రోకెన్ రైస్ 5 శాతం ఉంటే టన్ను ఒక్కింటికి 650 డాలర్ల నుంచి 350 డాలర్లకు పడి పోయాయన్నారు. ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇప్పటివరకు వియత్నాం మీద ఆధారపడి 4.5 మిలియన్ టన్నుల బియ్యం దిగుమతి చేసుకుంటున్న ఫిలిప్పీన్స్ తెలంగాణ బియ్యం దిగుమతిపై ఆసక్తి కనపరుస్తుందని మంత్రి  తెలిపారు.

ప్రతి సంవత్సరం 3 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్న నైజీరియా వంటి దేశాలు కూడా మనకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయన్నారు. సం బంధిత దేశాల్లో వినియో గించే బియ్యంపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపి రాష్ట్రంలో ఆయా పంటలు పండే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆగ్నేషియా కొనుగోలు దారులు కోరుకుంటున్న బియ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమావేశంలో  పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆచా ర్య జయశంకర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జానయ్య, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.