25 May, 2026 | 1:07 AM

ఐసీడీఎస్ సూపర్ వైజరా.. మజాకా!

25-05-2026 12:00 AM
  1. సీడీపీఓ సైతం మాటల మాయలో చిక్కాల్సిందే..
  2. సెలవు కావాలన్నా, చేయని పనికి జీతం రావాలన్నా పైసలు ప్రామాణికం?
  3. చీరె సారెలు, బంగారు నగలు టీచర్ ల నుండి వసూలు సాధారణమే!
  4. వసూలు చేసిన వాటిలో సగ భాగం ఆమెదేనట..
  5. నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ళుగా ఒకేచోట పని పట్టించుకోని ఉన్నతాధికారులు
  6. మరోసారి ట్రాన్స్‌ఫర్ పేరిట టీచర్‌ల నుండి భారీగా వసూళ్లకు సిద్ధం!
  7. టార్గెట్ చేసిన ఒక్క ‘రే వత్తి’డి అనుభవించాల్సిందే..?
  8. ఈమె ఆగడాలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలు

నల్లగొండ విజయక్రాంతి ప్రత్యేక ప్రతినిధి, మే 24 : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాయి. అయితే వాటి అమలులో సంబంధిత అధికారులు స్వార్ధపూరితంగా స్వప్రయోజనకర మైన విధానాలను ఆచరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. దీనికి మంచి ఉదాహరణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలోని కృష్ణానది సరిహద్దుగా కలిగి ఉన్న ఓ ప్రాజెక్ట్  లో నిర్వహింపబడుతున్న అంగన్ వాడి కేంద్రాల నిర్వహణ తీరు.

ప్రాజెక్ట్ అంతా ఆమె కనుసన్నల్లోనే

 ఆ ప్రాజెక్ట్ పరిధిలో నడుస్తున్న అన్ని  అంగన్వాడి కేంద్రాలపై ఓ సూపర్ వైజర్ ఆధిపత్యం చెలాయిస్తుందనే వార్తలు పెద్ద ఎత్తున  వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ కు సిడిపిఓగా ఎవరొచ్చినా వారిని ఆశల మాయమాటల్లో చిక్కించుకొని ఆమె అన్ని పనులను తనకు అనుకూలంగా  చేసుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి.

ఆరేళ్లుగా ఒకే సెక్టార్ లో విధులు :

 ప్రాజెక్ట్ పరిధిలోని అతి పెద్ద మండలంలో రెండు సెక్టార్ లు ఉండగా ఆ సూపర్ వైజర్ గతంలో నాలుగేళ్లు పని చేసిన ఆమె తర్వాత డిపిటేషన్ పై వేరే చోటికి వెళ్లింది. మూడేళ్ల తర్వాత మళ్ళీ అక్కడకి వచ్చిన సదరు సూపర్ వైజర్ తనకు సిడిపిఓతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో తిరిగి అదే సెక్టార్ లో జాయిన్ అయ్యి రెండేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తుంది. వాస్తవికంగా ఏ సూపర్వైజర్ అయిన ఒకసారి పని చేసిన సెక్టార్ లో మరోసారి పని చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఇన్నేళ్లుగా ఒకే సెక్టార్ లో విధులు నిర్వహించడం పట్ల  పలు అనుమానాలకు తావిస్తోంది.

సిడిపిఓలను చేజెక్కించుకొని 

ప్రాజెక్ట్ సిడిపివోలుగా ఎవరొచ్చినా వారి వద్ద అతి వినయం  ప్రదర్శిస్తూ.. కొన్నాళ్ళు వ్యక్తిగత పనులను చేస్తూ వారికి దగ్గరయ్యి మాయమాటలు చెబుతూ వారిని తమ వైపుకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. తర్వతా  వారికి అక్రమ సంపాదనపై ఆశలు  కలిగించి పూర్తిగా ఈ వ్యవహారాన్ని తన చేతిలోకి తీసుకుంటుందని ఆమె సెక్టార్ లో పని చేసే అంగన్ వాడి టీచర్ లే బాహాటంగా చెబుతుండటం గమనార్హం.

పైసలే ప్రామాణికం : 

ఆంధ్ర ప్రాంతానికి చెందిన సదరు సూప ర్ వైజర్ తన తెలివి తెలంగాణకు చెందిన టీచర్ లపై ప్రదర్శిస్తూ పైసలే ప్రామాణికంగా పనులు చేస్తున్నట్లు వినికిడి. సిడిపిఓ ల ను చేసి ఎక్కించుకొని టీచర్లకు సెలవులు కావాలన్నా.. లేదా అసలు విధులు నిర్వహించకుండానే జీతాలు తీసుకోవాలన్న ఈమె తో మాట్లాడి పైసలు చెల్లిస్తే ఎక్కడ ఏ ఆటంకాలు ఉండవనేది ఆమె కింద పని చేస్తున్న వారి ద్వారా వస్తున్న సమాచారం.

ఆమె సెక్టార్ లో అన్ని అవకతవకలే 

ఇక ఆమె విధులు నిర్వహించే సెక్టార్ లో ప్రతి పనిలో అవకతవకలకు పాల్పడుతుందని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె పరిధిలోని ఏ అంగన్వాడి కేంద్రంను విజిట్ చేసేందుకు సిడిపిఓ వచ్చిన కేంద్రానికి సంబంధించిన టీచర్ల నుండి వాహనము ఖర్చు పేరిట డబ్బులు వసూలు చేసి సగం ఆమె నొక్కి మిగిలిన సగం మొన్నటి వరకు ఇక్కడ పని చేసి పక్కజిల్లాకు బదిలీ అయిన సిడిపిఓకు ఇచ్చి తన పనులు సజావుగా పూర్తి చేసుకుందనే చర్చలు బాగానే సాగుతున్నాయి.

అయితే రెడీ.. సొంతింట్లో బడి :

 వాస్తవికంగా అంగన్ వాడి బడులను టీచర్ లు తమ సొంత ఇండ్లలో నడిపించవద్దు అనే నిబంధన ఉండగా ఈమె మాత్రం తను ఏర్పాటు చేసుకున్న టీచర్ ల ద్వారా సొంత ఇంట్లో బడులు నడిపే వారితో మా ట్లాడించి ఒకరేటుతో వారిని రెడీ చేసి తదుపరి సొంత ఇంటిలో బడి నడిపించుకునేం దుకు స్వీకారం తెలుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఆమె అనుమతి ఇచ్చి సొంత ఇంటిలో బడి నడుపుతున్న వారికి ప్రతి నెల రూ.2 వేల వరకు కిరాయి ఇప్పిస్తూ అందులో సగం ఆమే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈమె పని చేస్తున్న మండలంలోనే మరో సెక్టార్ కు ఈమెను ఇంచార్జి గా నియమించగా ఆ పరిధి లోనే చెరువు అనే పదం వచ్చే ఒక పెద్ద ఊరిలో ఒక పెద్ద మనిషి పెద్ద మనస్సు చేసుకుని మేము ఇంట్లో నివాసం ఉండడం లేదు.. మా  ఇంట్లో ఫ్రీ బాడీ నడుపుకోండి అని అందరి ముందే చెప్పినా ఆమె కిరాయి ఇంట్లోనే బడి నడిచేలా చూస్తుందంటే ఎంత నిజాయితీగా పని ఇట్టే అర్థమైపోతుంది.

చీరె సారెలు, బంగారు నగలు! :

ఆమె పనిజేసే మండలంలోని మరో సెక్టార్ తో పాటు ఆ మండలాన్ని ఆనుకుని పేరుగాంచిన దర్గా కలిగి ఉన్న మండలానికి సైతం ఇంచార్జి గా బాధ్యతలను అప్పజెప్పా రు. నాలుగైదు నెలల తదుపరి అక్కడికి కొత్తగా సూపర్ వైజర్ లు రావడంతో ఇన్నాళ్లుగా నేను మిమ్మల్ని కాపాడాను.. సిడిపిఓ సైతం మనకు సహకరించింది కాబట్టి ఆమెకు మనం సన్మానం చేద్దామని చెప్పి తాను ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా డబ్బులు లక్షల్లో వసూలు చేయించి చీరె సారెలు, బంగారు నగలు కొనిపించినట్లు ఆ పరిధిలోని అంగన్ వాడి టీచర్ లే తమ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.

అయితే వసూలు చేసిన వాటి లో సగం ఈమెనే నొక్కినట్లు టీచర్ల మధ్య చర్చలు సాగినట్లు వినికిడి. ఇవి చాలా ఉన్న ట్లు ఆమెతో కలిసి పనిచేస్తున్న సూపర్వైజర్ల పై సైతం పెత్తనం చెలాయించుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఒక్కరిద్దరూ నూత నంగా వచ్చిన సూపర్వైజర్లకు విధులపై సరిగా పట్టు రాకపోవడంతో ఈమెని అక్కడ పెత్తనాలు చేస్తూ అవకాశం దొరికిన చోట వసూళ్లకు పాల్పడుతున్నట్లు వినికిడి.

ఆర్డర్ కాపీలు ఇంటి వద్ద అందజేత

 గతంలో ఇక్కడ పని చేసిన సిడిపిఓ తో ఈమె అత్యంత సన్నిహితంగా మెలుగుతూ తమ పనిని ’విజయ’వంతంగా కొనసాగిస్తూ ”లక్ష్మి’ కటాక్షం పొందినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఆమె ఇక్కడ పనిచేస్తున్న సమయంలో నూతనంగా అంగన్వాడి టీచర్ల ఎం పిక జరగడంతో ఒక్కొక్కరి నుండి 70 నుం డి 80 వేలు వసూలు చేసి వారికి కేటాయించాలని విమర్శలు భారీగా వినవస్తున్నాయి. అయితే వారికి ఇచ్చి ఆర్డర్ కాపీలను సైతం వీరి ఇరువురు ఒకే కారులో జిల్లా దాటి పక్క జిల్లాలోని మిర్యాలగూడ పట్టణానికి వెళ్లి అక్కడికి సదరు వ్యక్తులను పిలిపించుకొని ఆర్డర్ కాపీలను ఇంటి వద్ద డబ్బులు తీసుకు ని అందజేశారనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

ట్రాన్స్‌ఫర్ పేరిట మరోసారి వసూళ్లకు సిద్ధం :

ఇన్నాళ్లుగా సీడీపీఓ అండతో వసూళ్లకు పాల్పడ్డ సూపర్ వైజర్ ఇటీవల ఆమె బదిలీ పై పక్క జిల్లాకు వెళ్లడంతో ఈ ప్రాజెక్టుకు నూతన సిడిపిఓ వచ్చింది. ఈమె తన వసూ ళ్ల దందాకు కొంతకాలం విరామం ఇచ్చి నూ తన సిడిపివోను సైతం తన బుట్టలేసుకు ని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయి తే ఈలోగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపడుతుండడంతో ఈసారి తాను కచ్చితంగా బదిలీ అవుతానని తెలిసి మరోసారి వసూళ్ల ప ర్వంకు తెర లేపినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.

ఆమె సెక్టార్ పరిధిలోని అంగ న్ వా డి టీచర్ లు అందరితో నేను వెళ్తున్నాను.. మిమ్మల్ని ఇన్నాళ్లు కాపాడాను మీరు సిద్ధం గా ఉండండి అనే సంకేతాలు ఇచ్చినట్లు ఆ మె కింద పని చేస్తున్న టీచర్లు చెబుకుంటున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. మొ త్తానికి ఈమె టార్గెట్ చేస్తే ఆ ఒక్క ’రే వత్తి’ డిని అనుభవించాల్సి వస్తుందనేది ఈ ప్రాజె క్టు పరిధిలోని అంగన్ వాడి టీచర్ అమ్మను చెబుతున్న మాట. ఈమె ఆగడాలతో ప్రభు త్వం అబాసపాలవుతుందని ఇప్పటికైనా ఈమె పై దృష్టి సారించి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.