calender_icon.png 22 February, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాల కూల్చివేత

22-02-2026 02:26:24 AM

అనుమతి లేకుండా ఫ్లోర్లు నిర్మించడంతో చర్యలు   

కేసముద్రం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డాకే కేసముద్రం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపించారు. పట్టణంలోని జ్యోతిబాపూలే సెంటర్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ఫ్లోర్ నిర్మించి మరో ఫ్లోర్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీతో నిర్మాణాన్ని కూల్చేందుకు చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అనుమతులు లేకుండా రెండు ఫ్లోర్లు నిర్మాణం చేపడుతుండడం విమర్శలకు దారి తీసింది.

అయితే నిర్మాణ పనులు నిర్వహిస్తున్న మేస్త్రీ ఇంటి నిర్మాణ సామగ్రి పాడవుతుందని, అవి తొలగించిన తర్వాత కూల్చివేయాలని అధికారులను వేడుకోవడంతో రెండు రోజులు గడువు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి నిర్మాణానికైనా మున్సిపాలిటీ ద్వారా అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇష్టానుసారంగా గతంలో పంచాయతీ పరిధిలో ఉన్న విధంగా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా గతంలో ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన కొందరు యజమానులు హద్దు దాటి నిర్మాణాలు చేపట్టినప్పటికీ మున్సిపాలిటీ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పరిహారం పొంది రోడ్డుకు అవసరమైన స్థలం వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్న పట్టించుకోవడంలేదనే విమర్శలున్నా యి. అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ దృ ష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.