ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
- గోదావరి నదీ జలాల సద్వినియోగంలో విఫలం
- కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ లేక 200 టీఎంసీలు నష్టపోతున్నాం
- సీతారామ సాగర్‌ను ఎందుకు పూర్తి చేస్తలేరు..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- గోదావరి జలాల వినియోగంపై సీఎంకు లేఖ
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): గోదావరి జలాల వినియోగం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. తెలంగాణకు కేటా యించిన సుమారు 968 టీఎంసీల గోదావరి జలాల పూర్తి వినియోగం ఇప్పటికీ సాధ్యం కాకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా పదవి చేపట్టి ఏళ్లు గడుస్తున్నా గోదావరి జలాల వినియోగంపై స్పష్టమైన పురోగతి కనిపించ కపోవడం విమర్శలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి గోదావరి జలాల వినియోగం, ప్రాజె క్టులపై రాసిన లేఖలో రాంచందర్‌రావు పలు అంశాలపై విమర్శలు చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడే వరకు, అప్ప టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువకాలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో గోదావరి జలాల వినియోగం కేవలం 400 టీఎంసీలకే పరిమితమైందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం గోదావరి నదిపై సుమారు 360 టీఎంసీల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందన్నారు.
కాళేశ్వరం ద్వారా 237 టీఎంసీలు, సీతారామసాగర్ ద్వారా 67 టీఎంసీలు, సమ్మక్క- ప్రాజెక్ట్ ద్వారా 47 టీఎంసీలు, చిన్న కాళే శ్వరం టీఎంసీలు, మోదికుంట వాగు టీఎంసీలు, చనాక టీఎంసీలు, గూడెం లిఫ్ట్ టీఎంసీలు, సీహెచ్‌ఎల్‌ఐఎస్ టీఎంసీల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వివరించారు. అయితే ఈ ప్రాజెక్టుల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని తెలిపారు.
బ్యారేజీల పునరుద్ధరణలో జాప్యం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2023లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. జరిగిన నష్టానికి మూలకారణం కనుగొని, ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) వరుసగా నివేదికలు కూడా సమర్పించి శాశ్వత పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సీఫార్సులను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరించిందని తెలిపారు. దీంతో మూడు బ్యారేజీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితికి రాలేదని, ఫలితంగా సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీసీఏ) ఆమోదం ఇచ్చినప్పటికీ ఇంకా ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు. ఈ ఆలస్యంతో తెలంగాణ ప్రజలు 67 టీఎంసీల గోదావరి జలాల వినియోగ ప్రయోజనాన్ని కోల్పోతున్నారని తెలిపారు.
ముందుకు సాగిన సమ్మక్క- ప్రాజెక్టు..
సమ్మక్క- ప్రాజెక్టకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్లూసీ) 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని, అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కమాండ్ ఏరియా గు ర్తింపులో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ప్రాజె క్ట్ ముందుకు సాగడం లేదని తెలిపారు. ట్రిబ్యునల్ ద్వా రా తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల గో దావరి జలాలను పూర్తిగా వినియోగించే దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని సీఎంను ఆయన లేఖలో కోరారు. హామీ ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అమలు చేసిన తర్వాతే నదుల అనుసంధాన ప్రాజెక్టు కింద అదనపు గోదావరి జలాల వినియోగాన్ని సరిగ్గా అంచనా వేయొచ్చని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం గోదావ రికావేరి (ఐఎల్‌ఆర్) నదుల అనుసంధాన ప్రాజెక్టు ఇచంపల్లి నుంచి కావేరి వరకు సాగుతుంది. నాగార్జునసాగర్, సోమశిల మార్గంగా ఈ ప్రాజె క్ట్ అమలు కానుం ది. మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరించనుందని, ఈ ప్రాజెక్టు తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు ఉపయోగకరంగా మారనుందన్నారు. అయి తే ఈ ప్రాజెక్టు మూల స్థానం, మార్గాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. గోదావరి బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టులు, జలాల వినియోగంపై సరై న ప్రణాళిక, అమలులో చిత్తశుద్ధి, నిబద్ధత కొరవడటం తో గోదావరి నదీ జలాలల సమర్థవం తమైన వినియోగంలో జాప్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.






