25 May, 2026 | 3:05 AM

అపూర్వం.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

25-05-2026 02:09 AM

కౌకుంట్ల మే 24: మండల కేంద్రంలోని జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో 2010-11 ఏడాదిలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం దేవరకద్ర మండలంలోని లక్ష్మీ పల్లి సమీపంలో ఉన్న భవాని రిసార్టులో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం భాగంగా సరస్వతి విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 10 విద్యార్థులకు పాఠాలు బోధించి స్వర్గస్తులైన గణిత శాస్త్ర  ఉపాధ్యాయులు నాగేందర్ మరణించడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

అనంతరం పూర్వ విద్యార్థులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదివిన రోజులను గుర్తు చేసుకొని నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం జీవితంలో తాము చేస్తున్న అంశాలను ఉపాధ్యాయులకు వివరించారు. పూర్వ విద్యార్థులు కొన్ని ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామలింగం, ఉపాధ్యాయులు రాజశేఖర్, సతీష్,రాములు, కొండన్న, సల్మాన్ రాజు, నీలిమ, ప్రసన్న, అరుణ జ్యోతి, శ్రీనివాసులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.