25 May, 2026 | 2:39 AM

అహంకార పొంగులేటి!

25-05-2026 01:31 AM

మంత్రి వాకిటి శ్రీహరిపైకి పేపర్ విసిరివేతపై సర్వత్రా విమర్శలు

  1. సోషల్ మీడియాలో వీడియో వైరల్
  2. జాజుల సహా బీసీ సంఘాల నేతల మౌనం 
  3. బీసీ మంత్రులు పేరుకేనా.. 
  4. మండిపడుతున్న సామాజిక వర్గాలు

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): అహంకార ‘పొంగు’లేటి.. బ్రీఫింగ్‌కు బీసీ మంత్రులు పనికిరారా? ఏకంగా మీడియా ముందే బీసీ మంత్రిపై పేపర్ విసిరివేస్తావా? ఎందు కు ఎప్పుడూ ఒకే వర్గానికి చెందిన మం త్రు లే మీడియా బ్రీఫింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తారు? బీసీ మంత్రు లకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదా? వాళ్లు మాట్లాడితే అసహనం ఎందుకు? బీసీ సంఘాల నేతలు, బీసీ మంత్రుల మౌనమేళ? మీమీ పదవులు ఊడుతాయనే భయమా? అంటూ ఇటు ప్రజా క్షేత్రంలో, అటు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.

జనాభాలో సగ భాగానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం దక్కకపోవడమే కాదు.. కనీసం గౌరవం కూడా లభించకపోవడం మరింత దౌర్భాగ్యం. తమ ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పించామని పదేపదే చెప్పుకునే కాంగ్రెస్, ఒక బీసీ మంత్రి పట్ల ఒక అగ్రకుల మంత్రి ప్రవర్తించిన తీరుపై స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యాబినెట్ సమావేశం అనంతరం శనివారం నిర్వహించిన మీడియా బ్రీఫింగ్‌లో ఒక  ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయా ల్లో పెనుదుమారం లేపుతోంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సహచర మంత్రి వాకిటి శ్రీహరిపై పేపర్ విసిరినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కేవలం ఇద్దరు మంత్రుల మధ్య వ్యవహారం కాకుండా బీసీ గౌరవం, అధికార వ్యవస్థలో సామాజిక సమీకరణలు, ప్రభుత్వంలో బీసీల స్థానం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమైంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

కానీ ఇప్పటివరకూ బీసీ సంఘాల నేతలు, ముఖ్యంగా బీసీ ఉద్యమాల్లో తరచూ గళం వినిపించే జాజుల శ్రీనివాస్‌గౌడ్ సహా పలువురు అగ్రనేతలు  ఇప్పటివరకు బహిరంగంగా స్పందించకపోవడం మరింత ఆగ్రహజ్వాలలు రేపుతోంది. బీసీ మంత్రిపై అందరి ముందు అలాంటి ప్రవర్తన జరిగితే కూడా మాట్లాడకపోతే ఇక బీసీ సంఘాల అవసరం ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల తుఫాన్   విజృంభిస్తోంది.

బ్రీఫింగ్‌కు బీసీ మంత్రులు పనికిరారా?

క్యాబినెట్ సమావేశం అనంతరం మం త్రులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి ఏదో వివ రణ ఇస్తుండగా పక్కనే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ పేపర్‌ను విసిరినట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. కొందరు దీనిని సాధారణ అసహనంగా చూస్తుండగా మరికొందరు మాత్రం ఇది అహంకార ప్రదర్శన, సహచర మంత్రిని అవమానించడమేనని, బీసీల ఆత్మగౌరవానికి భంగమేనని దుమ్మెత్తిపోస్తున్నారు.

ప్రత్యే కంగా వాకిటి శ్రీహరి బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతో ఈ ఘటనను సామాజిక కోణంలో విశ్లేషించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు ఎప్పుడూ ఒకే వర్గానికి చెందిన మంత్రులే మీడియా బ్రీఫింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తారు?, బీసీ మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదా?, వాళ్లు మాట్లాడితే అసహనం ఎందుకు? అంటూ ప్రజల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వంలో సంఖ్యాపరంగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించినా కీలక సందర్భాల్లో మాత్రం వారికి పూర్తి గౌరవం, నిర్ణయాధికారం లభిస్తున్నాయా? అనే సందేహాలు ఇలాంటి ఘటనలతో బయటపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో మంత్రి పొంగులేటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాటి మంత్రి పట్ల మెలిగే తీరు ఇదేనా, ఓపిక లేకపోతే మృదువుగా చెప్పొ చ్చు కదా?, సానుకూలంగా సూచించవచ్చు కానీ అందరి ముందు పేపర్ విసరడం ఏంటి?, ఇది మంత్రి స్థాయికి తగిన ప్రవర్తనా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నా రు. కొంతమంది అయితే అధికార అహంకారం పరాకాష్టకు చేరిందా? అని ప్రశ్ని స్తున్నారు. 

స్పందించని జాజుల.. బీసీ మంత్రులు మౌనం ఎందుకు?

సాధారణంగా బీసీల హక్కులు, ప్రాధా న్యం, రాజకీయ ప్రాతినిథ్యం వంటి అంశాలపై వెంటనే స్పందించే జాజుల శ్రీనివా స్‌గౌడ్ సహా పలువురు బీసీ నేతలు ఈసారి మాత్రం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. బీసీ మంత్రిపై జరిగిన ఘటన కూడా కనిపించడం లేదా?, రాజకీయ ఒత్తిడుల వల్లే మౌనం పాటిస్తున్నారా?, అధికార పార్టీకి దగ్గరగా ఉండడం వల్ల మాట్లాడటం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కొంతమంది బీసీ యువ నేతలు అయితే సాధారణ వ్యక్తిపై జరిగితే పెద్ద ఎత్తున స్పందించే సంఘాలు మంత్రి విషయంలో మాత్రం ఎందుకు మౌనం? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రభుత్వంలోని ఇతర బీసీ మంత్రులు కూడా స్పందించకపోవడం రాజకీయంగా మరింత చర్చకు దారి తీసింది. మంత్రి పదవులు పోతాయనే భయమా?, కుర్చీ కోసం సమాజ గౌరవాన్ని పక్కన పెడుతున్నారా?, బీసీలు పేరుకే మంత్రులా? అంటూ విమర్శలు వస్తున్నాయి.

బీసీ వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తి భవిష్యత్తులో రాజకీయ ప్రభావం చూపే అవకాశ ముందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీసీలు కీలక ఓటు బ్యాంక్. అలాంటి వర్గంలో గౌరవం దక్కడం లేదనే భావన పెరిగితే అది రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషిస్తున్నారు. 

ప్రతిపక్షాలకు కొత్త అస్త్రం

ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఈ అం శాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సామాజి క న్యాయం పేరుతో అధికారంలోకి వ చ్చిన ప్రభుత్వం నిజంగా బీసీలకు గౌర వం ఇస్తుందా? అని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వంలో బీసీలు కేవలం సంఖ్య కోసమే ఉన్నారా? అని విమర్శిస్తున్నా రు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. బీసీ యువతలో అసహనం వ్యక్తమవు తోంది. కొన్ని సంఘాలు త్వరలో సమావేశాలు నిర్వహించి, అధికారికంగా స్పం దించే అవకాశాలున్నట్లు సమాచారం.

అదే సమయంలో బీసీ సంఘాల నేత లు ఇప్పటికైనా స్పందిస్తారా? జాజుల సహా ప్రముఖ నేతలు తమ వైఖరి వెల్లడిస్తారా? లేక ఈ మౌనం కొనసాగు తుందా? అన్నది ఆసక్తికరంగా మారిం ది. ఒక చిన్న వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీసీ గౌరవం, అధికార అహం కారం, సామాజిక సమానత్వం వంటి పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది.