18 June, 2026 | 2:11 AM

అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి

18-06-2026 12:53 AM

ఎమ్మెల్యే రాగమయి 

సత్తుపల్లి జూన్17 (విజయక్రాంతి): అర్హుల అందరికీ కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలు వారికి కచ్చితంగా చేరాలని, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ప్రజలకు ఎలా సేవలందిస్తు న్నారు, ఏమేమి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి, ప్రజాదర్బార్ లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినారా, జి పి ఓ లు , సెక్రటరీలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, హౌసింగ్ ఏఈల పనితీరు ఎలా ఉంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉన్నాయా అని ప్రతి ఒక్కరి తోటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి,అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రజా దర్బార్ లో ప్రజలు పెట్టుకున్న దరఖాస్తు వివరాలు పూర్తిగా పరిష్కరించాలని, గ్రామాల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తుదారులు ఇంకా ఉంటే ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే వారికి రేషన్ కార్డు అందజేయాలని, అతి త్వరలో రెవిన్యూ,ఫారెస్ట్ జాయింట్ సర్వే జరుగుతుందని అధికారులంతా రెడీగా ఉండాలని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అర్హుల గల ప్రజలకు చేరే విధంగా అందరు కృషి చేయాలని అన్నారు. ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పెండింగ్లో ఉంచవద్దని వారికి సూచించారు. ఆర్ఐలు, జిపిఓ లు,సెక్రటరీలు, మండల పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రెహనా కమల్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ఉన్నారు.