Districts - Khammam

‘ప్రాణా న్యాచురల్స్’స్టోర్‎ను ప్రారంభించిన తాతా మధు, సండ్ర
‘ప్రాణా న్యాచురల్స్’స్టోర్‎ను ప్రారంభించిన తాతా మధు, సండ్ర

(ఖమ్మం,విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రకృతిసిద్ధమైన ఆహారోత్పత్తులు ఎంతో అవసరమని *ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డు, రాపర్తి నగర్ (హెచ్‌పీ పెట్రోల్ పంపు ఎదురుగా) నూతనంగా ఏర్పాటు చేసిన ‘ప్రాణా న్యాచురల్స్’ స్టోర్‌ను ఆదివారం ఉదయం వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకులు కోలేటి ప్రవీణ్, నవీన్‌లను అతిథులు అభినందిస్తూ, ప్రజలకు నాణ్యమైన సహజసిద్ధ ఉత్పత్తులను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు

13-09-2026 | 04:23pm

మట్టి గణపతులకే జై కొడదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
మట్టి గణపతులకే జై కొడదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

కూసుమంచి సెప్టెంబర్ 13 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణను ప్రధాన ద్యేయంగా భావిస్తూ కూసుమంచి మండల ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్, ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యతనిస్తూ వినాయక చవితి జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కూసుమంచి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల ఉచిత కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం వారు ఘనంగా చేపట్టారు. ప్రజలు,భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా మట్టి ప్రతిమలను స్వీకరించారు.

13-09-2026 | 04:01pm

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ

(ఖమ్మం, విజయక్రాంతి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి శుభఫలితాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, సంప్రదాయాలను పాటిస్తూనే మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిద్దామని పిలుపునిచ్చారు.

13-09-2026 | 03:58pm