గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
- రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): గుడిసెలు లేని తెలంగాణే ప్రజాప్రభుత్వ లక్ష్యమ ని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మొదటి విడత విజయ వంతం అయ్యిందని, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద నియోజకవ ర్గానికి 500 ఇళ్లు ఇ చ్చామని, రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివ సిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధా న్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిం చారని అన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసి న తర్వాతే ఇతర దర ఖాస్తులను పరిగణ నలోకి తీసుకోవాల న్నారు. గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించా రు.
అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచిం చారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తం గా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని, పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలని ఆదే శించారు. ఎంపీడీవో స్థాయిలో జాబితాలను సిద్ధం చేసి, సంబంధిత ఇన్‌చార్జి మంత్రుల ఆమో దానికి పంపించాలని సూచించారు. సర్వే ప్రక్రియ లో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాల న లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవా లన్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని, ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేశామన్నారు. రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లను అవకాశం దక్కిం దన్నారు.
ఆయా ఇండ్ల ఆర్సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అం దించనున్నట్లు తెలిపారు. గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసం పూర్తిగా ఉన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు.






