18 June, 2026 | 2:11 AM

పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు పునఃప్రారంభం

18-06-2026 12:54 AM

బూర్గంపాడు, జూన్17 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండలంలో ఆయా ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని బూర్గంపాడు మండల ఎంఈవో యదుసింహరాజు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆధారనమోదు కేంద్రం ఏర్పాటు చేశామని ఈ నమోదు కేంద్రాలను విద్యార్థులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎంఈఓ యదసింహారాజు ఆదేశాల మేరకు ఎంఐఎస్ కోఆర్డినేటర్ కిషన్ ఆధార్ కేంద్రాన్ని సందర్శించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 34 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయని.. ప్రతి మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఆధార్ నమోదు కేంద్రంలో డెమోగ్రఫిక్, బయోమెట్రిక్, మ్యాండటరీ బయోమెట్రిక్, న్యూ  ఎన్రోల్మెంట్( కొత్త ఆధార్), పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ మార్పు సేవలు అందుబాటులో ఉంటాయని, 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లలు, పెద్దలు వేలిముద్రలు ద్వారా అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాలని సూచించారు.