పుష్కరకాలం విలసిల్లిన రాష్ట్రంలో.. ముష్కరుల పాలన
ఇది దండుపాళ్యం ముఠా.. విధ్వంసం తప్ప వికాసం తెలియదు
కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
- బాంబుల మంత్రి రెవెన్యూ శాఖను నాశనం చేసిండు
- రేవంత్‌రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాసరెడ్డి గజదొంగ
- ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు మొనగాళ్లు కాదు.. మోసగాళ్లు!
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచ కాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. ప్రజాపాలన అంటూనే ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. మంత్రులు పరిపా లనపై కాకుం డా పైసల కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్ నాకు ఆదర్శం అంటున్నాడు.. ఆయన హిట్లర్ అయితే మంత్రులు ఆయన దగ్గర పనిచేస్తున్న సామాంతరాజులయ్యారు.
వెలుగుమట్లలో రాక్షసుడిలాగా అర్ధరాత్రి వెయ్యి ఇళ్ళు కూలగొట్టాడు.. హైడ్రా పేరుతో హైద రాబాద్ జనాలను నిద్రనివ్వడం లేదు. పేదలు రోడ్డున పడితే ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రు లు.. దండుపాళ్యం నాయకులుగా పనిచేస్తున్నారు.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
ఖమ్మం, జూన్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రజా పాలన అంటూనే ప్రజల సొమ్మును దొచుకుంటున్న మంత్రులను ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నా రు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పా రు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి వంద సీట్లు రావడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. పుష్కరకాలం పుష్కలంగా పంటలతో విలసిల్లిన తెలంగాణ రాష్ట్రం ముష్కరుల పాలైందని ఆయన అన్నారు.
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్‌లో పాలేరు నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ముఖ్య నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోంది. బాంబుల మంత్రి రెవెన్యూ శాఖ పేరుతో కోట్లాది విలువైన భూములను కబ్జా చేస్తున్నారు. భట్టి విక్రమార్క దోచుకోవడం, దాచుకోవడమే పనిగా ఉన్నారు.
రాష్ట్రంలో యూరియా లేదు, కరెంటు లేదు, రైతుబంధు లేదు, ధాన్యం కొనే దిక్కులేదు. వ్యవసాయ శాఖ మంత్రి అక్రమాలు రోజుకు ఒక్కటి బయటకు వస్తున్నాయి. ఖమ్మంలో ఉన్న ది ముగ్గురు మొనగాళ్ళు కాదు, ముగ్గురు మోసగాళ్లు’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలవ దని, మంత్రులు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు పాలేరు నియోజకవ ర్గంలో ప్రతి ఒక్కరికి తెలియాలి, కార్యకర్తలు ఇంటింటీకీ ప్రచారం చేయాలి.
పొంగులేటి.. మోదీ కాళ్ళు పట్టుకున్నాడు, అందుకే ఈడీ దాడులపై కేసులు పెట్టలేదు. కోటి ఎకరాల భూములు 22ఏ కింద పెట్టారు.. రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాస రెడ్డి గజదొంగ. రెండున్నర సంవత్సరాలలో శ్రీనివాసరెడ్డి చేసింది ఏమీ లేదు’ అని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై అహంకారం చూపెడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అధికారం అడ్డంపెట్టుకుని వట్టినాగులపల్లిలో రైతులపై దాడులు చేసిండని కేటీఆర్ ఆరోపించారు.
పాలేరులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగురుతుందని.. 20 లక్షల ఇళ్లు కడితేనే ఓటు అడుగుతా అన్న మాట మీద నిలబడే దమ్ము ఉందా పొంగులేటీ అని సవాల్ చేశారు. ఎలక్షన్‌ల ముందు ఎస్సీ, ఎస్టీ ఇంటికి అరులక్షల రూపాయల ఇస్తా అన్నారని, ఏ ఇంటికి ఆరు లక్షలు ఇచ్చారో చెబుతారా.. చూపిస్తారా..? అని ప్రశ్నించారు.
పొంగులేటి అహంకారం..
‘తెలంగాణలో కోటి ఎకరాలు వివాదాస్పద జాబితాలో పెట్టి వాటిని దోచుకుంటున్నాడు. కోటి ఎకరాల పైన ఆంక్షలు పెట్టి ఆ భూములను బెదిరించి సెటిల్మెంట్లు చేయించుకుంటూ నికృష్టమైన పనులు చేస్తున్నాడు. పొంగులేటి డైలాగులు, అహంకారం ప్రజలందరూ చూశారు. పొంగులేటి బీసీ మంత్రులు కొండా సురేఖని మాట్లాడనియ్యకుండా మైక్ కట్ చేశారు. పక్కన ఉన్న మరో బీసీ మంత్రి వాకిటి శ్రీహరి మీద కాగితాలు విసిరేశారు. ఎంత అహంకారం కాకుంటే తోటి మంత్రులతో అంత అహంకారంగా ప్రవర్తిస్తాడు.
బీసీ మంత్రులు కూడా పొంగులేటి మాదిరే ప్రజలతో ఎన్నుకోబడ్డ వారని గుర్తుంచుకోవాలి. అధికారులను పట్టుకొని సెన్సు ఉందా అని అహంకారంతో పొంగులేటి మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారంగా దోచుకోవడానికి, అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడిని అడ్డు పెట్టుకొని వట్టినాగులపల్లిలో గజదొంగల భూములు దోచుకోవడానికి నీకు సెన్స్ ఉందా అని అడుగుతున్నా.
వట్టినాగులపల్లిలో పదుల ఎకరాలపైన మీ కొడుకును, కిరాయి మూకలు పంపి వాళ్లపై దాడి చేసింది వాస్తవం కాదా? నీ కొడుకుపైన పోలీస్ కేసు నమోదు చేస్తే ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా? నీ అన్యాయాలు, అక్రమాలు అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నావా? చివరికి సమ్మక్క సారలమ్మ జాతర్ల టెండర్లను కూడా పొంగులేటి వదిలిపెట్టలేదు. సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా కమీషన్ల కుమ్ములాటల కోసం మంత్రులు కొట్లాడుకున్నారు. ములుగు జిల్లాలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు పొంగులేటి. అందుకే పాలేరులో ఎప్పుడు ఎన్నిక వచ్చినా గులాబీ జెండా మాత్రమే ఎగురుతుంది’. అని కేటీఆర్ అన్నారు.
ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి..
‘విధ్వంసం తప్ప వికాసం తెలియదు కాంగ్రె స్ నాయకులకు.. ఇవ్వాళ రైతుబంధు రావడం లేదు.. దేవుని మీద ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారు.. యూరియా దుకాణం ముందు రైతు లు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు.. కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తు మళ్లీ పెడతా అంటున్నారు. దానిని కచ్చితంగా బీఆర్‌ఎస్ అడ్డుకుం టుంది’ అని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీ కార్డులు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అని ప్రశ్నించారు.
‘కేసీఆర్ లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాడు, సీతారామా ప్రాజెక్టును 80శాతం పూర్తిచేశారు’అని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశారు.. ఇది నిజంకాదా.? 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ఎందుకు హామీ ఇచ్చా రు.. వానపాము కూడా నాగుపాము లాగా బుసలు కొడుతోంది.. మళ్లీ గెలిచేది కేసీఆర్.. అందులో డౌటేలేదన్నారు.
బలమైన కమిటీలు..
బూత్‌ల వారీగా బలమైన కమిటీ నిర్మా ణం జరగాలని కేటీఆర్ అన్నారు. ఓటర్ లిస్టు వడపోత కార్యక్రమం జరుగుతుందని, సర్‌ను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్టపోతాం అని సూచించారు. ‘రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు, 35,985 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్‌కు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా ఒక బీఎల్‌ఏను ఏర్పాటు చేసుకోవాలి. అర్హులైన వారి ఒక్క ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాద్యత బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలది. పాలేరు నియోజకవర్గంలో అనుమానాస్పదంగా 10వేల ఓట్లు ఉన్నాయి.
గెలుపుకు, ఓటమికి ఒక్క ఓటు తేడా ఉంటుంది, అంద రూ జాగ్రత్తగా చూసుకుని పనిచేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతామధు, రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. హెలికా ప్టర్‌లో మెడికల్ కాలేజీ గ్రౌండ్‌కు వచ్చిన కేటీఆర్‌కు ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు.






