22 May, 2026 | 2:38 AM

నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం

22-05-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

నూతనకల్ , మే 21:జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, వచ్చే నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల మండలాల్లోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి, ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. వీటికి సంబంధించి రూ.437 కోట్లను ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రతిరోజు ట్యాబ్ ఎంట్రీలు, టాక్ షీట్లను నిరంతరం నిశితంగా పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.  వచ్చే నాలుగు రోజులు ధాన్యం కొనుగోళ్లకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, జిల్లాలోని పూర్తి స్థాయి ధాన్యాన్ని సేకరిస్తామని, కావున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భరోసా ఇచ్చారు.ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమాల్లో డీఆర్డీఓ సన్యాసయ్య, అడిషనల్ ఫీడ్ చంద్రశేఖర్, ఆత్మకూరు ఎంపీడీఓ హాసిమ్, మద్దిరాల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, నూతనకల్ ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు.