22 May, 2026 | 2:29 AM

మద్దిమడుగు అంజన్న చెంత అర్ధరాత్రి అగ్నిప్రమాదం

22-05-2026 02:03 AM

ఐదు దుకాణాలు, ద్విచక్ర వాహనం దగ్ధం

అచ్చంపేట, మే 21: నల్లమల్ల అభయారణ్యంలో ఉన్న శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఐదు దుకాణాలు, ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణాల్లోని పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, నగదు, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రమాదంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆలయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని డాక్టర్ వంశీకృష్ణ సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.