22 May, 2026 | 1:40 AM

నూతనకల్‌లో నార్కోటిక్ డాగ్స్ విస్తృత తనిఖీలు

22-05-2026 12:00 AM

నూతనకల్, మే 21: మండలంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఉత్తర్వుల మేరకు గురువారం నూతనకల్ మండల కేంద్రంలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ (జాగిలం)సహాయంతో విస్తృత సోదాలు నిర్వహించినట్లు ఎస్త్స్ర నాగరాజు విలేకరులకు తెలిపారు.ఈ తనిఖీల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు, మరియు కూరగాయల మార్కెట్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎస్త్స్ర మాట్లాడుతూ గంజాయి, ఇతర ప్రమాదకరమైన మత్తు పదార్థాలను, మాదకద్రవ్యాలను అత్యంత వేగంగా గుర్తించడంలో ఈ నార్కోటిక్ డాగ్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందాయన్నారు.  మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా ఉండేందుకే ఈ ముందస్తు సోదాలు నిర్వహించామన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పదంగా గంజాయి విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఈ విస్తృత తనిఖీ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ నిర్వహణ సిబ్బంది మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.