కాళేశ్వరంలో భక్త ప్రవాహం
వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం
పుష్కర స్నానం ఆచరించిన కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
కాళేశ్వరం/మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): కాళేశ్వరంలో భక్త ‘ప్రవా హం’ పోటెత్తింది. కాళేశ్వరం త్రివేణి సంగ మం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో ఉదయం 5.43 నిమి షాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారం భం అయ్యాయి. వేకువజామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతీ నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమాన్ని వైభవం గా నిర్వహించారు.
త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ సాంప్రదాయానికే పరిమితమైన సరస్వతి అంత్య పుష్కరాలు ఈసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గోదావరి పుష్కరాల సమయం లో నిర్మించిన సరస్వతి ఘాట్(వీఐపీ ఘాట్) లో సరస్వతి నది అంత్య పుష్కరాలను నిర్వహిస్తున్నారు. విఘ్నాధిపతి అయిన విఘ్నే శ్వరునికి తొలి పూజలు చేసిన తరువాత ఈ వేడుకలకు అంకురార్పరణ చేశారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదా య శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి, రంగారెడ్డి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
అత్యంత అరుదైన సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుష్కర స్నానలను కూడా నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర మక్తీశ్వరస్వామిని, శ్రీ శుభానంద దేవిని, సరస్వతి మాతను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం కొన్నిరోజులుగా అవిశ్రాంతంగా శ్రమించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పుష్కర స్నానాలు ఆచరించి, చదువుల తల్లి సరస్వతి మాతా ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులు సౌకర్య వంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
నూతన మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్..
సరస్వతి అంత్య పుష్కరాల వేడుకల్లో భాగంగా రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించబడిన నూతన మ్యూజియాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మ్యూజియాన్ని పరిశీలించి, అందులో ఏర్పాటు చేసిన విభిన్న శిలా సంపదను ఆసక్తిగా వీక్షించారు. ఈ మ్యూజియం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మించారని గవర్నర్ తెలిపారు.
దీన్ని ప్రజలు, యువత, విద్యార్థులు సందర్శించి శిలా సంపదపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ దంపతులకు జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలిపారు.
పుష్కర స్నానాలు చేసిన ముఖ్యఅతిథులు..
సరస్వతి అంత్య పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర నది సంగమంలో తొలి పుష్కర స్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆచరించారు. అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితరులు ఆచరించారు. అలాగే గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు, భూపాలపల్లి, రంగారెడ్డి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్‌రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానం చేశారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ౧ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ ప్రత్యేక ర వాణా సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయ న తెలిపారు. భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఎండీ స్పష్టం చేశారు. ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాలకు సంబంధించిన సంప్రదింపు నంబర్లను కూడా సంస్థ విడుదల చేసిందని, హైదరాబాద్ భక్తులు సమాచారం కోసం 995922624 5 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
అదేవిధంగా నర్సంపేట (9959226293), తోరూర్ (9959226053), భూపాలపల్లి (9959 226707), మణుగూరు (99592259 6 3), కరీంనగర్ (9959225920), మంథని (9959225923), హన్మకొండ (995922 6049), మహబూబాబాద్ (99592260 54), జనగాం (9959226050), పరకాల (9959226051), నిజామాబాద్ (9959 226016), గోదావరిఖని (9959225922 ), మంచిర్యాల (9959226004) నంబర్లలో సంప్రదించి బస్సుల వేళలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వ్బుసైట్ www.tgsrtcbus.in ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. భక్తులు ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.






