22 May, 2026 | 3:39 AM

జలగం జనార్ధన్‌కు నివాళి

22-05-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 21: సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకుడు జలగం జనార్ధన్(జన్నుసార్) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోలెబోయిన కిరణ్ కుమార్ కోరారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో గురువారం జనార్ధన్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో, 14 ఏళ్లు రహస్య జీవితం గడిపిన జున్ను సార్ పేద ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించారని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఎల్‌ఎస్ నాయకుడు పోలెబోయిన లింగయ్య,వడకాల బయన్న, సురేష్, పవన్, మనోజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.