కృష్ణాలో పడవ బోల్తా
నలుగురు మృతి
మరో ముగ్గురు గల్లంతు
ఏపీలోని పల్నాడు జిల్లా కోనూరులో ఘటన
అమరావతి, జూన్ 14 (విజయక్రాంతి): కృష్ణా నదిలో విహారయాత్రకు వెళ్లిన ఘటన విషాదాంతంగా మారింది. ముగ్గురు చిన్నారులు సహా మరో వ్యక్తి మృతి చెందిన విషా ద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. కోనూరులోని బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు 10 మంది హాజరయ్యారు.
వేడుక అనంతరం వీరంతా ఆదివారం పడవలో విహారయాత్రకు వెళ్లారు. వీరు ప్రయా ణిస్తున్న పడవ బోల్తాపడింది. గమనించిన స్థానికులు నీటిలోకి దూకి ఆరుగురిని కాపాడారు. నలుగురు గల్లంతయ్యారు. పోలీసు లు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టి ఇ ద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. గంధం సంధ్య, గంధం సైనీ, బత్తుల కార్తీక్ అనే ముగ్గురు చిన్నారులు, కొనత చైతన్యలు మృతి చెందారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.






