15 June, 2026 | 2:49 AM

మాకు దేశమే ఫస్ట్

15-06-2026 01:46 AM
  1. ఫ్యామిలీ ఫస్ట్ పాలసీతో కాంగ్రెస్
  2. ఢిల్లీలోని కుటుంబానికి మూటలు మోస్తున్న సీఎం రేవంత్ 
  3. సీటు చోరీ, ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం 
  4. దేశ తొలి ప్రధాని ఎంపికలో సీటు చోరీ చేసిందే కాంగ్రెస్ 
  5. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి నెహ్రూకు పదవి 
  6. ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
  7. మీడియా సమావేశంలో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నేషన్ ఫస్ట్ పాలసీతో బీజేపీ ముందుకు పోతుంటే.. ఫ్యామిలీ ఫస్ట్ పాలసీతో కాంగ్రెస్ సాగుతున్నదని రాజ్యసభసభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమ ర్శించారు. ఢిల్లీలో ఉన్న కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని నెహ్రూను అధిగమించి 4,399 రోజులకుపైగా దేశానికి సేవలందించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. కుటుంబాలకే పరిమితం అన్న భావనను చెరిపేస్తూ, సామాన్యుడు అత్యున్నత స్థానానికి చేరుకోవడం ప్రజాస్వామ్య గొప్పతనమని చెప్పారు.

ఈ విజ యాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు వారి అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శిం చారు. రాజ్యసభ ఎన్నికల్లో సీట్ చోరీ, ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అసలు దేశ రాజకీయాల్లో మొట్టమొదటి సీటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూలేనని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశ తొలి ప్రధాని ఎంపిక కోసం జరిగిన ఓటింగ్‌లో అత్యధికులు స్పష్టమైన మెజారిటీతో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మద్దతిచ్చినప్పటికీ ప్రజాస్వామ్య అభిప్రాయాలను, నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి నెహ్రూకు ఆ పదవిని కట్టబెట్టారని, ఆ నాడే కాంగ్రెస్ అసలైన సీటు చోరీకి పాల్పడిందని పేర్కొన్నారు. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రజాస్వా మ్యం గురించి, సీటు చోరీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కానీ, కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు ఎన్నుకు న్న నాయకుడిని విమర్శిస్తూ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఈసీ నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించినా విమర్శలు ఆపక పోవడం వారి నిరాశకు నిదర్శనమన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొ న్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కేవలం పన్ను ల వాటా రూపంలోనే తెలంగాణకు రూ.1.18 లక్ష ల కోట్లకుపైగా నిధులు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కిం ద దాదాపు రూ.లక్ష కోట్లు కేంద్రం అందించిందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ పరిమితులకు అతీతంగా 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల రూపంలో రాష్ట్రానికి రూ.9,502 కోట్లు ఇచ్చిందన్నారు. రైల్వే బడ్జెట్‌ను రూ.258 కోట్ల నుంచి రూ.5,336 కోట్ల కు పెంచారని, ఏటా జరిగే ట్రాక్ పనులను 17 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్లకు పెంచి, రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్ విద్యుద్దీకరణ పూర్తిచేశారన్నారు.

రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ ఏర్పా టు, 40 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా మార్చ డం, ౫ వందే భారత్ రైళ్లు నడపడం కేంద్రం విజయాలన్నారు. రాష్ట్రంలో రూ.31వేల కోట్లతో 4,9 26 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించారని, భారత్‌మాల కింద రూ.38,297 కోట్లతో 1,719 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్లు (సూరత్ హైదరాబాద్- హైదరాబాద్- పనాజీ) మంజూరు చేశారన్నారు. నిజామాబాద్‌లో నేషనల్ టర్మరిక్ బోర్డును, బీబీనగ ర్‌లో రూ.1,350 కోట్లతో ఎయిమ్స్, రూ.889 కో ట్లతో ములుగులో గిరిజన వర్సిటీని, రూ.500 కోట్లతో కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను, ౭ జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను కేంద్రమే మంజూరు చేసిందని వివరించారు.

నెహ్రూ రికార్డును అధిగమించి..

దేశ చరిత్రలోనే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి, 4,399 రోజులకు పైగా అత్యధిక కాలం ప్రజాస్వామ్యబద్ధంగా దేశానికి సేవలందించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మో దీ సరికొత్త రికార్డు సృష్టించారని లక్ష్మణ్ స్పష్టంచేశారు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లు.. ఇలా దాదాపు 25 ఏళ్లపాటు ప్రజాప్రతినిధిగా కొనసాగడం సాధారణ విషయం కాద న్నారు. కాంగ్రెస్ పాలనలోని బంధుప్రీతి, అవినీతికి భిన్నంగా మోదీ 12ఏళ్ల పాలన జీరో టాల రెన్స్ టు కరప్షన్ విధానంతో నిజాయితీగా సాగిందన్నారు.

2047 నాటికి దేశాన్ని వికసి త భారత్ గా, విశ్వగురువుగా నిలబెట్టేందుకు మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. మోదీ హయాంలో సుమా రు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ఇప్పటివరకు రూ.4.3 లక్షల కోట్లను 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. 2014లో వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరబోతోందని ఆశాభావం వ్యక్తంచేశారు.

యువతను జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్‌గా మార్చడానికి స్టార్టప్ ఇండియా, ముద్ర యోజనల ద్వారా ప్రోత్సహిస్తున్నారన్నారు. రక్షణ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ప్రధాన డిఫె న్స్ హబ్‌గా కీలక కేంద్రంగా మారిందన్నారు. రా ష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశం, పేదల సంక్షేమం ముందు ఏ పార్టీ అయినా చిన్నదేనని, మోదీ చెప్పింది చేసే నాయకుడని కొనియాడారు.