15 June, 2026 | 2:50 AM

వెలుగుల సింగరేణి

15-06-2026 01:40 AM
  1. సంస్థను కాపాడుకోవడం మన బాధ్యత
  2. అభివృద్ధికి సమష్టిగా కృషిచేద్దాం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  4. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శన
  5. హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు

మంచిర్యాల, జూన్ 14 (విజయక్రాంతి): వందల ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధి కి అందరం కలిసి కట్టుగా కృషి చేద్దామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్‌ను సందర్శించారు. ఓపెన్ కాస్ట్ మైన్ సందర్శనలో భాగంగా రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అం శాలతో పాటు గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్ప త్తి, బొగ్గు నిల్వ ప్రదేశాలు, రికార్డులు  పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యేల ప్రేమ్‌సాగర్‌రావు, ఎమ్మె ల్సీ దండే విఠల్, సింగరేణి సిఅండ్‌ఎండి బుద్ధ ప్రకాష్ జ్యోతి, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్ లతో కలిసి మాట్లాడారు. సింగరేణి సంస్థ మనుగడ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని భట్టి అన్నారు.

కార్మికులు శ్రమ, చె మటతో బొగ్గును ఉత్పత్తి చేసి సంస్థను అభివృద్ధి చేయడమే కాకుండా దేశానికి వెలుగులు అందిస్తున్నారని, వారి ఆత్మ గౌరవం కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వీటిని అపహాస్యం చేస్తూ కొంత మంది అస త్య ప్రచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి అని అన్నారు.

కార్మికుల ఆరోగ్య కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగరేణి కార్మికులకు కోటి 25 లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించామని, సింగరేణి కార్మికుల పిల్లలకు యుపిఎస్‌సి పరీక్షలు,

ఇం టర్వ్యూలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వ యంతో సింగరేణి బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిశగా కృషి చేస్తున్నామన్నారు. అంతకుముందు మొక్కలు నాటి, నీరు పోశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మం చిర్యాల మేయర్ ధర్ని మధుకర్, సింగరేణి డైరెక్టర్లు గౌ తం పొట్రు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమల్ రావ్, ఈడి కోల్ మూమెంట్ వెంకన్న జాదవ్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ రఘు కుమార్, శ్రీరాంపూర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.