19 April, 2026 | 3:10 AM

వివ రెడ్డికి చార్లీ చాప్లిన్ అవార్డు

19-04-2026 01:23 AM

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): సినిమా టైటిల్స్ డిజైనర్ వివ రెడ్డికి ప్రపంచ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ 137వ జయంతి సందర్భంగా ప్రతిష్ఠాత్మక చార్లీ చాప్లిన్ అవార్డు లభించింది. రవీంద్రభారతీ వేదికగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ సౌజన్యంతో రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా వివ రెడ్డి..

అతిథులు తెలంగాణ శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేతుల మీదుగా ఈ సత్కారం అందుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలకుపైగా సినిమాకు ఆత్మ, ప్రేక్షకుడికి అనుభూతి ఇచ్చిన కళాకారుడిగా వివ రెడ్డి నిలిచారన్నారు.