తెలంగాణ ఆత్మీయ సమావేశం నిర్వహించాలి
కేటీఆర్‌ను కోరిన దుబాయ్ తెలంగాణ ప్రతినిధులు
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): దుబాయ్‌లో తెలంగాణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని దుబాయ్ తెలంగాణ ప్రతినిధులు కోరారు. దుబాయ్ తెలంగాణ ప్రతినిధులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో అమెరికాలోని డల్లాస్, మలేషియా తదితర దేశాల్లో తెలంగాణ ప్రవాసులతో విజయవంతంగా నిర్వహించిన సమావేశాల తరహాలోనే, దుబాయ్‌లో కూడా తెలంగాణ ప్రజలు, బీఆర్‌ఎస్ అభిమానులు, ప్రవాస తెలంగాణవారితో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కేటీఆర్‌ని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, దుబాయ్ ప్రతినిథులు కిరణ్ పీచర, రాధారపు సత్యం, సుధాకర్ రెడ్డి,పలువురు ప్రవాస ప్రముఖులున్నారు.






