15 July, 2026 | 12:22 AM

‘సివిల్స్’ అభ్యర్థులకు ఉచిత కోచింగ్

15-07-2026 12:22 AM

బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణ బీసీ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (టీజీబీసీఎస్‌డీటీసీ), వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ -కమ్ -మెయిన్స్) 2027 పరీక్షకు ఉచిత  కోచింగ్ అందించనున్నట్లు డైరెక్టర్ డా మామిడి హరికృష్ణ తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు హైదరాబాద్‌లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ నిర్వహించనున్నారు. 150 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 100 మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా, ఇప్పటికే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 50 మందిని నేరుగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైపెండ్, రూ.5 వేల పుస్తక నిధి, లైబ్రరీ సౌకర్యం, నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ, సబ్జెక్ట్వారీ పరీక్షలు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల్లో పు, పట్టణ ప్రాంత అభ్యర్థుల ఆదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఉద్యోగంలో ఉండకూడ దు. ఇతర కోర్సులు చదువుతూ ఉండరాదు. ఇదివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇలాంటి కోచింగ్ పొందకూడదని నిబంధనలు పేర్కొన్నారు.