15 July, 2026 | 1:05 AM

అప్పగించిన పనులను భాద్యతగా పనిచేయండి

15-07-2026 01:05 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్, జూలై 14 (విజయ క్రాంతి) : జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఐదు మండలాల స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యుల సమగ్ర ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో పాటు మండల సమాఖ్య అధ్యక్షులు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని అదనపు పనిగా కాకుండా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యతగా అధికారులు, సిబ్బంది భావించి సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా స్పష్టం చేశారు.

అమలులో ఎక్కడైనా సమన్వయ సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డి.ఆర్.డి.ఓ నరసింహులు, డి.ఎం.హెచ్.ఓ డా. ఎ. శ్రీనివాసులు, ఎ.పి.ఎం.లు, డి.పి.ఎం.లు, మండల సమాఖ్య అధ్యక్షులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.