19 April, 2026 | 3:10 AM

దోమల బెడదను అరికడదాం

19-04-2026 01:22 AM

జవహర్‌నగర్, ఏప్రిల్ ౧౮ (విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... తద్వారా దోమల నివారణను అరికట్టవచ్చునని ప్రజాపాలన- ప్రణాళికల లక్ష్యాలను అనుకున్న మేర సాధించ వచ్చునని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత పిలుపునిచ్చారు.

కీసర సర్కిల్ జవహర్‌నగర్ అంబేద్కర్‌నగర్ డ్వాక్రా భవనంలో శనివారం ఎంటమాలజీ వింగ్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడేలో  భాగంగా దోమకాటు వ్యాధులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఈ సంతోష్, అనిల్, భాస్కర్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సందీప్, మహిళా సంఘా ల గ్రూప్ సభ్యులు కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంటమాలజీ  సిబ్బంది శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.