ఓల్డ్ మీర్‌పేట్ లోప్రెషర్ సమస్యను పరిష్కరిస్తాం
19-04-2026 01:24 AM
ఉప్పల్, ఏప్రిల్ ౧౮ (విజయక్రాంతి): మల్లాపూర్ డివిజన్లోని ఓల్డ్ మీర్‌పేట్ శాంతినగర్ నరసింహ నగర్‌లో నెలకొన్న లోప్రెషర్ నీటి కష్టాలను త్వరలోనే పరిష్కరిస్తామని జలమండలి ఏఈ రోహిత్ అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిల్లు ముదిరాజ్ ఫిర్యాదు మేరకు జలమండలి అధికారి ఏఈ రోహిత్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కాలనీలలో పర్యటించారు.
అనంతరం ఆయన మాట్లాడు తూ, నీటికష్టాలు రాకుండా జలమండలి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని, కాలనీలో త్వరలోనే లోప్రెషర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు జానీగౌడ్, కాలనీ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, బాబీ గౌడ్, రమేష్ పాల్గొన్నారు.






