సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకే రోబోటిక్ విద్య
తెలంగాణ గ్రామర్ స్కూల్లో రోబోటిక్ విద్య ప్రారంభం
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు పట్టణంలోని తెలంగాణ గ్రామర్ స్కూల్లో మంగళవారం రోబోటిక్ విద్యా కార్యక్రమాన్ని స్కూల్ చైర్మన్ ఎస్కే జానీమియా మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ ఎస్కె జానీమియా మాట్లాడుతూ రోబోటిక్స్ విద్య ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం,సమస్యలను పరిష్కరించే నైపుణ్యం,సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతాయని పేర్కొన్నారు.
భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయటంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఎస్.కె జానీమియా చెప్పారు.స్కూల్ వైస్ చైర్మన్ పసుమర్తి చందర్రావు మాట్లాడుతూ తెలంగాణ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోబోటిక్స్ ప్రదర్శనను విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు వీక్షించారు.కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇస్మాయిల్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






