15 July, 2026 | 12:02 AM

‘టెర్మిన్’ మత్తు ఇంజెక్షన్ల విక్రయం...

15-07-2026 12:02 AM
  1. ఈజీ మనీకి అలవాటు పడి
  2. ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు
  3. పోలీసుల తనిఖీలతో భయటపడ్డ వైనం

ఆదిలాబాద్(మంచిర్యాల), జూలై 14 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో విచ్చల విడిగా ‘టెర్మిన్’ మత్తు ఇంజక్షన్ల విక్రయం ప్రజలను కలవెరపెడుతోంది... వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయిస్తుండటం, ఇది పట్టణం నుంచి పల్లెలకు సైతం పాకికట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ సమీపాన మహారాష్ట్రలోని పలు జిల్లాలకు ఈ ‘టెర్మిన్’ మత్తు ఇంజక్షన్లు ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా తరలుతున్నట్లు సమాచారం. మత్తు కు బానిసైన వారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజక్షన్లు దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తు లో ఉంచుతాయి, ఎలాంటి నొప్పి తెలియనీయకపోవడంతో ఇలాంటి ఇంజక్షన్లను యు వత మత్తుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 

ఈజీ మనీకి అలవాటు పడి...

ఈజీ మనీకి అలవాటు పడ్డ ముఠా సర్జరీల సమయంలో మాత్రమే వినియోగిం చాల్సిన టెర్మిన్ (Mephentermine Sulphate Injection IP) అనే మత్తు పదార్థాన్ని మెడికల్ ఏజెన్సీ, మెడికల్ షాపు నిర్వాహకుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి గంజాయి వినియోగదారులు, ఇతర వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించడం మొదలు పెట్టారు. ఇంజక్షన్ ధర రూ. 390 ఉండగా దానిని బహిరంగ మార్కెట్ లో రూ. 1500 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు డాక్టర్లకు మాత్రమే విక్రయించాల్సిందిగా ఉండగా మత్తు ముఠా సభ్యులు బహిరంగంగా ప్రజలకు విక్రయిస్తుండటంతో అది గంజాయి వ్యసనపరులకు వరమైంది.

ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ఇంజక్షన్లు భయటకు విచ్చలవిడిగా రావడం, మెడికల్ దుకాణాలలో డ్రగ్స్ విక్రయాలను పరిశీలించాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టనట్టుగా ‘మామూలు’గా ఉంటుండంతో కిమి స్ట్ అండ్ డ్రగ్గిస్ట్ లు ఆడిందే ఆటగా సాగుతుంది. ఈజీగా డబ్బు సంపాధించడమే ల క్ష్యంగా పెట్టుకున్న ముఠా కారణంగా ఎంత మంది ప్రాణాలు పోతాయోనని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

పోలీసులకు సవాల్ గా మారుతున్న మత్తు ముఠా...

శాంతి భద్రతలు కాపాడటం కోసం 24 గంటలు పని చేస్తున్న పోలీసులకు మత్తు ముఠా నుంచి మరో సవాల్ ఎదురవుతోంది. ఇప్పటి వరకు డ్రగ్స్, గంజాయి ముఠాలను అరికట్టడంపై దృష్టి సారించిన పోలీసులకు.. ఇంజక్షన్ల రాకెట్ రూపంలో మరొక పరీక్ష ఎదురవుతోంది. గతంలో ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టెర్మిన్ మత్తు ఇంజెక్షన్లను దొంగతనంగా భయటకు తీసుకెళ్లిన విషయం విధితమే కాగా తిరిగి జిల్లా కేంద్రంలో ఇటీవల నిషేధిత ఇంజెక్షన్ల ముఠా పట్టుబడటంతో ఈ నెట్ వర్క్ లో ఇంకెంత మంది ఉన్నారనే దానిపై పోలీసులు నిఘా పెట్టారు.

చాపకింద నీరులా పాకుతున్న మత్తు వ్యసనపరులను గుర్తించడం, ముఠాను పట్టుకోవడం, డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి.? అవి ఎక్కడ వరకు చేరుతున్నాయనేది తెలుసుకోవడం పోలీసులకు సవాల్ అనే చెప్పవచ్చు. ఈ డ్రగ్స్ ఇప్పటికే అడిక్ట్ అయిన వారిని గుర్తించి వారికి వై ద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ముఠా పట్టుబడటంతో జిల్లాలో కలకలం...

ఈ నెల 12న రాత్రీ ఆర్టీసీ బస్టాండ్ వద్ద టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కె నాగరాజు, ఎస్‌ఐ అఖిల్, ప్రణయ్ కుమార్ లు పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహి స్తున్న సమయంలో అనుమానాస్పదంగా స్కూటీపై సంచరిస్తున్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించిన సిందే జగన్నాథ్ (ఆర్‌ఎంపీ)ను పట్టుకొని విచారించగా అస లు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆదిలాబాద్ పట్టణానికి సిందే జగన్నాథ్ మెడికల్ దుకాణ నిర్వాహకులైన రమేష్ గౌడ్ (జగదాంబ ఫార్మసీ అండ్ సర్జికల్స్), సయ్యద్ కమరుద్దీన్ (గెట్ వెల్ మెడికల్)లతో కలిసి ముషారఫ్, సమీర్, ఇర్ఫాన్ ఖాన్, ముకీద్ లతో కలిసి ముఠాగా ఏర్పడి నిషేధిత ఇంజెక్షన్లు మత్తు వ్యసనపరులకు చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

వీరి నుంచి 190 ఇన్సులిన్ సిరంజిలు, 50 మెఫె న్ టెర్మిన్ బాటిల్స్, ఒక స్కూటీ రెండు మొ బైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ముఠా వీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తుందన్న దానిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా గట్టి నిఘా పెడితే పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.