పెండింగ్ కేసులను పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నాగర్ కర్నూల్, జూలై 14 (విజయక్రాంతి): జిల్లాలో నమోదవుతున్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో మిస్సింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గ్రేవ్, నాన్గ్రేవ్, సైబర్ నేరాల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.
సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్, ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డయల్-100కు వచ్చే ప్రతి కాల్ పై తక్షణమే స్పందించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫేక్ నెంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.






