calender_icon.png 18 February, 2026 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో సత్తా చాటిన వెల్గటూర్ రెవెన్యూ ఆర్ఐ

18-02-2026 12:48:43 PM

అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో రజత పతకం కైవసం!

ధర్మపురి,(విజయక్రాంతి): యూఏఈలోని అబుదాబీలో జరిగిన అంతర్జాతీయ ఆర్చరీ క్రీడా పోటీల్లో(International Archery Competitions) వెల్గటూర్ మండల రెవెన్యూ పరిశీలకురాలు(ఆర్ఐ) దొంత రాజేశ్వరి సత్తా చాటారు. ఫిబ్రవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఓపెన్ మాస్టర్ 2026 క్రీడలు జరిగాయి. ఇందులో దాదాపు 148దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 50ఏళ్ల విభాగం కాంపౌండ్ లో 50మీటర్ల ఆర్చరి కేటగిరిలో 28మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు.

వీరిలో ఆర్ఐ దొంత రాజేశ్వరి(RI Dontha Rajeshwari) తృతీయ స్థానంలో నిలిచి రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. సామాన్య కుటుంబంలో జన్మంచిన రాజేశ్వరి ప్రభుత్వ ఉద్యోగం సాధించినప్పటికీ ఆర్చరీ క్రీడా పట్ల ఉన్న మక్కువను మరవలేకపోయారు.ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అనేకసార్లు దేశ విదేశాల్లో ఆర్చరీ పోటీల్లో పాల్గొంటూ అనేక పథకాలు సాధించి ఇండియాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టారు. నూతనoగా సాధించిన విజయం పట్ల వెల్గటూర్ మండల తహసీల్దార్  రాపెల్లి శేఖర్, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ రాజేశ్వరిని అభినందనలు తెలియజేశారు.