29 June, 2026 | 1:47 AM

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ

29-06-2026 12:54 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆయనకి ఘన నివాళులు అర్పించారు. గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుంచి గట్టెక్కించిన నరసింహారావు తెలంగాణలో పుట్టడం మ నందరికి గర్వకారణమని కొనియాడారు.

తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభు త్వం ఎంతో ఘనంగా నిర్వహించిందని గు ర్తుచేశారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని, నెక్లెస్ రోడ్‌కు పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ నరసింహారావు అజరామర కీర్తిని చాటిచెప్పేలా వా రి ఎత్తయిన విగ్రహాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.