ప్రత్యేక ఓటరు సవరణపై ప్రజలకు అవగాహన
చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో 2కే రన్‌లో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు
చేవెళ్ల, జూన్ 28 (విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ 18 సంవత్సరాల నిం డిన ప్రతి పౌరునికి ఒక కల్పించడమే లక్ష్యం గా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రత్యేక ఓటరు సవరణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా రెవిన్యూ మున్సిపల్ అదికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తా మొదలు షాబాద్ చౌరస్తా వరకు 2k రన్ నిర్వహించా రు.
చేవెళ్ల ఆర్డిఓ పార్థసారధి రెడ్డి మాట్లాడు తూ... ప్రత్యేక ఓటరు సవరణ అనేది అక్రమ ఓట్ల తొలగింపు కొత్త ఓటర్లు నమోదు చేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. తహసిల్దార్ హరికృష్ణయ్య మాట్లాడుతూ... ఓటు రా జ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని భా రత పౌరులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ మా ట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు పొందే అవకాశం రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.
చైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం sir అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చనిపోయిన వారి ఓట్లు తొలగించి 18 ఏళ్లు నిండిన యంగ్ స్టార్స్ కు అవకాశం కల్పిస్తుంది అన్నారు. రెండు ఓట్లు కలిగి ఉంటే ఒకటి తొలగించుకోవాలని వారు సూచించారు. ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు, అధికా రులు, రెవిన్యూ సిబ్బంది హాజరయ్యారు.






