29 June, 2026 | 3:17 AM

ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి

29-06-2026 02:07 AM

మేడ్చల్ అర్బన్, జూన్ 28 (విజయక్రాంతి): తెలుగు జాతికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ పరిధిలోని గౌడవెల్లి పట్టణంలో పివి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ’తెలంగాణ ముద్దుబిడ్డ’ బహుభాషా కోవిదుడు, భారతరత్న,సంస్కరణ సృష్టికర్త,దేశం మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గౌడవెల్లిలో కార్యాలయ ఆవరణలో ఆ యన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజ లి ఘటించినట్టు తెలిపారు.

భారత ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గౌడవెల్లి గ్రామ మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ కొనియాడారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి.మాజీ కోఆప్షన్ సభ్యులు డి గోపాల్ యాదవ్.మాజీ వార్డు సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాలకుర్తి మురళి గౌడ్.పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ వినోద్ గౌడ్ నాయకులు ఎల్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.