29 June, 2026 | 1:13 AM

జూలై 2న తలపెట్టిన చలో ఉప్పల్ భగాయత్‌కు తరలి రావాలి

29-06-2026 12:44 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి బండారి మహేందర్ ముదిరాజ్

కోదాడ, జాన్ 28 : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో ఉప్పల్ భగాయత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం కోదాడ పట్నంలోని కొమరం భీమ్ ఆడిటోరియం ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితమ్మ చేస్తున్న పోరాటానికి అందరు మద్దతు పలకాలన్నారు.

ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మూడేళ్లు కావస్తున్నా నీటి వరకు అమలు కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం 28 వేల పెన్షన్, స్వతంత్ర సమరయోధుల గుర్తింపు కార్డులు వంటి హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు అన్నారు.

ఉప్పల్ భగాయత్ లో 350 ఎకరాల భూమి ఉందని ఉద్యమకారులకు పంచాలని తమ అధినేత కవితక్క జూలై 2న చేపట్టిన ఈ ఉద్యమానికి కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం నుండి వందలాది మంది ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.కవితక్క నాయకత్వంలో ఉద్యమకారుల హక్కులన్నీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ సంజీవ నాయక్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి లాజర్ నాయక్ మురళి నాయక్ ఉన్నారు.