29 June, 2026 | 2:12 AM

కాలుష్య కోరల్లో పొలాలు

29-06-2026 01:29 AM
  1. పంటల వ్యర్థాల కాల్చివేతతో ముంచుకొస్తున్న ముప్పు-
  2.    17 లక్షల ఎకరాల్లో వరి కొయ్యలు, వరిగడ్డి, మొక్కజొన్న, జొన్న పంటల వ్యర్థాల దహనం
  3. రెండున్నర సెంటి మీటర్లలోతు భూసారానికి హాని
  4. కలియదున్నితే ఎంతో ప్రయోజనం

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): వివిధ రకాల పరిశ్రమలు నుంచి వెదజల్లే కాలుష్యం ఇప్పటీ వరకు పట్టణాలకే పరిమితమైంది. ఎప్పు డూ పచ్చగా ఉండి, స్వచ్ఛమైన గాలి, నీరుతో ఉండే పల్లెలు కూడా ప్రస్తుతం కాలుష్యానికి గురవుతున్నాయి. పొలా ల్లో పంటల కోత తర్వాత.. పంట వ్యర్థాలను రైతులు కాల్చివేస్తుండడంతో కాలుష్యం విజృంభిస్తోంది. అనేక విషవాయువులు విడుదలై పచ్చని పొలా లు, గ్రామాలు కూడా కాలుష్యకోరల్లోకి వెళ్తుతున్నాయి.

కార్బన్‌మోనాక్సైడ్, భాస్వరం, పొటాష్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు వాతావరణాన్ని చాపకింద నీరులా ఆవహిస్తున్నాయి. అంతేకాదు నేలసారాన్ని నిర్వీర్యం చే స్తూ... అనేక సూక్ష్మజీవులను కబళిస్తున్నా యి. దీంతో పంటలకే కాదు.. సకల జీవరాశులకు కూడా ఎంతో హానికరమని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. గత రెండు, మూడేళ్ల నుంచి మొదలైన దహనం.. ఏటికేడు పెరుగుతోంది.

ఈ యాసంగి నాటికి 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను అగ్నికి ఆహుతి చేసినట్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గణంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల నెలకొల్పిన అధు నాతన ఆర్‌ఎస్ అండ్ జీఐఎస్ (రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్ సిస్టం) ప్రయో గ శాలలో గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉ పగ్రహ ఛాయా చిత్రాలతో ఈ గణాంకాలు బయటికి వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొ త్తం 17 లక్షల ఎకరాలలో పంట వ్యర్థాలను ఆయా పొలాలలోనే కాల్చగా సుమా రు 9 లక్షల ఎకరాల్లో వరి కోత అనంతరం వరి కొ య్యలు, గడ్డిని ఆయా పొలాలలోనే కాల్చివేశారు. మిగతా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొ న్న, జొన్న పంటల వ్యర్థాల అగ్నికి ఆహుతి అయినట్లు ఈ గణాంకాలకు బట్టి తెలుస్తోంది.

నేల ఆరోగ్యం, గాలి నాణ్యతలు కలుషితం

పంట వ్యర్థాలన్నీ కాల్చివేయడం వల్ల నేల ఆరోగ్యం, గాలి నాణ్యత తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఈ వ్యర్థాల కాల్చివేతను నివారించకుంటే కాలుష్య ప్ర మాదం మరింత పెరిగే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పంట వ్యర్థాలను దహనం చేయడంతో భూమిలోని రెండున్నర సెంటిమీటర్ల దిగువ భాగం వరకు నేల ఆరోగ్యానికి హానికారం. అంతేకాదు పంటలకి సంబంధించిన లాభసాటి బ్యాక్టీరియా, ఫంగల్ సూక్ష్మజీవులు అగ్నికి ఆహుతి అవుతాయి.

తద్వారా నేల నిస్సారంగా మారే ప్రమాదం ఉంటుంది. ఒక టన్ను వరిగడ్డి, కొయ్యలను పంట పొలాల్లో కాల్చివేయడం వల్ల ఐదున్నర కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ ఉత్పత్తు, గాలిలో కలసిపోతాయని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ఎకరాకు సుమారు రెండున్నర టన్నుల వరిగడ్డి, వ్యర్థాలు వస్తాయి.

అంటే ఒక ఎకరం వరి విస్తీర్ణంలో పంట వ్యర్థాలను కాల్చినట్లయితే 13.5 కిలోల భాస్వరం, 6.75 కిలోల పొటాష్ గాలిలో కలసిపోయి వాతావరణం కలుసితం అవుతుంది. ఈ లెక్కల ప్రకారం 23.63 లక్షల కిలోల నత్రజని, 11.90 లక్షల కిలోల భాస్వరం, 1062 లక్షల కిలోల పొటాష్ ఈ మూడు మాసాలలోనే గాలిలో కలసిపోయినట్లు వ్యవసాయరంగ అధికారుల అధ్యయనంలో తేలింది. 

మొదటి స్థానాల్లో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం

అయితే తెలంగాణలోని 33 జిల్లాలలో అత్యధిక పంట వ్యర్థాలని కాల్చివేసినా.. మొ దటి ఐదు స్థానాలలో నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి ఉండగా, అదే విధంగా అతి తక్కువ పంట వ్యర్థాలని కాల్చివేసిన జిల్లాలలో వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, అసిఫాబాద్, మహబూబ్ నగ ర్ జిల్లాలు ఉన్నాయి. మొత్తం 17 లక్షల పం ట వ్యర్థాల కాల్చివేసిన విస్తీర్ణంలో పై ఐదు జిల్లాల వాటా 34 శాతం ఉండటం గమనార్హం. 

పంట వ్యవర్థాల కాల్చివేతలో జిల్లాల వారీగా.. 

నిజామాబాద్ (10 శాతం), కామారెడ్డి (7 శాతం), ఖమ్మం (7శాతం), కరీంనగర్ (5శా తం), పెద్దపల్లి (5 శాతం), నిర్మల్ (5 శాతం), జగిత్యాల(5శాతం), హన్మకొండ(4 శాతం), వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్నసిరిసిల్ల, యాదాద్రి భువనగిరి (3శాతం), నాగర్‌కర్నూల్, నల్లగొండ, భద్రాద్రికొత్తగూడెం, జోగులాంబ గద్వాల, ములు గు(2 శాతం), సంగారెడ్డి, జనగాం, నారాయణపేట్, మంచిర్యాల(1 శాతం) ఉన్నాయి. వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, అసిఫాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 

టన్ను కాల్చితే.. 60 కిలోల కార్బన్‌మోనోక్సైడ్ విడుదల

 ఒక టన్ను పంట వ్యర్థాల కాల్చివేత వల్ల 60 కిలోల అతి ప్రమాదకర మైన కార్బన్‌మోనోక్సైడ్‌తో పాటు 1,460 కిలోల డైయోక్సైడ్, 200 కిలో ల బూడిద గాలిలోకి విడుదల అవుతుందని శాస్త్రీయ అధ్యయనాలు వెల్ల డిస్తున్నాయి. వీటితో పాటు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధా న కారణమైన మీథేన్, నైట్రోజిన్ ఆక్సై డ్ వాయువులు గాలిలోకి విడుదల అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగినట్లయి తే ప్రస్తుతం గాలి పొల్యుషన్ ఇండెక్స్‌లో సురక్షితంగా ఉన్న హైదరాబాద్ మహానగరం వచ్చే 10 ఏళ్లలో మరో ఢిల్లీలా తయారు అవుతుందని ఆం దోళన వ్యక్తమవుతోంది. అందుకు ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా వీటిని తిరిగి నేలలోనే కలియదున్ని, కొంత కాలం కుళ్లేలా చేస్తే నేల సారం పెరగటంతో పాటు కాలుష్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై రైతుల్లో అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.