calender_icon.png 19 February, 2026 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ట్రోఫీ ఆవిష్కరణ

19-02-2026 02:25:18 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 18: అమెచ్యూర్ గోల్ఫర్స్ కోసం టీ గోల్ఫ్ ఫౌండేషన్ , బౌల్డ ర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ ఉత్సాహంగా ప్రారంభమయింది. ఈ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతకు ఇచ్చే ట్రోఫీని టీ గోల్ఫ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్‌రెడ్డి, మధుసూదన్ రావు, పాపిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా చార్మినార్, బుద్ధ విగ్రహం చిత్రాలను డిజైన్ చేశారు.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 300 మందికి పైగా గోల్ఫర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. నేడు, రేపు క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలు జరుగుతాయని, శనివారం ఫైనల్ నిర్వహిస్తామని  టీ గోల్ఫ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ ఆర్ ఎన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేసే ఉద్దేశంతో టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరపున పలు టోర్నీలు నిర్వహించినట్టు వెల్లడించారు.