పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
మొయినాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం మొయినాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్తో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు.
భారీ ఏర్పాట్లు:
జిల్లా వ్యాప్తంగా 0 నుండి 5 ఏళ్ల లోపు ఉన్న సుమారు 4.21 లక్షల మంది చిన్నారుల కోసం 1,618 బూత్లు, 50 మొబైల్ బృందాలను అందుబాటులో ఉంచారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేసేలా వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఇ న్చార్జి భీంభరత్, డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






