24 April, 2026 | 2:45 AM

అర్బన్ నక్సలైట్లా?

24-04-2026 01:24 AM
  1. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సర్కారు అణచివేత ధోరణి
  2. టెంట్లు, సామాను ఇస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు
  3. తీవ్రంగా వైరల్ అవుతున్న తాండూరు పోలీసుల తీరు

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): గతంలో.. నక్సలైట్లకు ఎలాంటి సా యం చేసినా.. షెల్టర్ ఇచ్చినా.. మందులు, ఆహారం, ఇతరత్రా సహాయం చేసినా.. నక్స లైట్ సానుభూతి పరులుగా ముద్రవేసి.. అవసరం అయితే నక్సలైటుగా అనుమానం వ్యక్తంచేసి అరెస్టు చేయడం.. లేదా ఎన్ కౌం టర్ చేయడంకూడా జరిగేది. దీనితో గ్రామాల్లోకి నక్సలైట్లు వచ్చి.. సమావేశం ఏర్పాటు చేసి వారు పాడే పాటలు విన్నా.. థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించిన సంఘటనలు కోకొల్లలు..

ఇప్పుడు.. చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి.. చర్చలు విఫలమైన తరువాత.. తమకు రా వాల్సిన బకాయిలు, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ సంస్థను ప్రైవేటీ కరించకుండా కాపాడాలంటూ సమ్మెకు దిగి న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అణచివేతకు దిగుతోంది.

ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు ఎ లాంటి సాయం చేసినా.. ఆఖరికి వారికి టెం టు సామాగ్రి అద్దెకు ఇచ్చినా చట్టరీత్యా చర్య లు తప్పవని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తూ.. ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఆర్టీసీ కార్మి కులు అర్బన్ నక్సలైట్లా అనే అనుమానాలు వస్తున్నాయి.

పత్రికా ప్రకటన..

తాండూర్ పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాపు ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్‌కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడు స్తున్న ది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది. మరియు గవర్నమెంట్‌కు వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామన్లు గానీ, టెంట్లుగానీ ఇచ్చి సమ్మెకు మద్దతు పలికినచో, అట్టివారిపైన చర్యరీత్య చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

ఇట్లు

తాండూర్ పోలీస్,

వికారాబాద్ జిల్లా.

ఇదీ స్థూలంగా రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. ఆర్టీసీ కార్మికులకు న్యాయబద్ధంగా అందాల్సిన వాటికోసం, ఆర్టీసీ సంస్థను రక్షిం చుకునేందుకు ముందస్తుగానే నోటీసు ఇచ్చి.. చర్చలు విఫలమైన తరువాత సమ్మెకు దిగితే.. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్ర భుత్వం ఆర్టీసీ కార్మికులపై అనుసరిస్తున్న అణిచివేత ధోరణిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎలాగైనా ఆర్టీసీ కార్మికుల సమ్మెను అడ్డుకోవాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేధావులు, రాజకీయ విశ్లేషకు లు, ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా గర్హిస్తున్నారు.

కనీసం ఆర్టీసీ కార్మికులకు టెంట్లు, సామాగ్రి ఇవ్వడం, అలాగే ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ హా ళ్లను అద్దెకు ఇవ్వడంకూడా నేరమనేలా హె చ్చరికలు జారీచేయడంపై తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. గతంలో నక్సలైట్ల విషయంలో వ్యవహరించినట్టుగానే.. ఇప్పటి ప్ర భుత్వం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పట్ల వ్యవహరించడంలో భాగంగానే ఇలాంటి అణిచివేత ధో రణి హెచ్చరికలు జారీచేయడమని విశ్లేషకు  లు ఎత్తిచూపుతున్నారు.

కార్మికులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలు గా, ఎలాంటి టెంటు సామా నులు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లను అద్దెకు ఇవ్వవద్దు అని, ఎలాంటి సమావేశా లు జరిగినా.. మీదే బాధ్యత, మీపై చర్యలు తప్పవంటూ పోలీసుల హెచ్చరికలు చేయడంతో ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ హాళ్లు, టెంటు సామాను అద్దెకు ఇచ్చే యజమానులు లబోదిబోమంటున్నా రు. ఉపాధి కోసం తాము టెంటు షాపులు పెట్టుకుంటే.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదేం బెదిరింపులంటూ వాపో తున్నారు.

నక్సలైట్లతో అలా.. 

గడిచిన కొంత కాలంగా తెలంగాణ ప్రభు త్వం నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలవాలంటూ పిలుపిస్తోంది. పెద్ద పెద్ద నక్సలైట్ నాయకులు ఆయుధాలు అప్పగించి రాష్ట్ర డీజీపీ ముందు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు లొంగిపోయారు. వారి పునరావాసం,  వారిపై ఉన్న రివార్డుల ను వారికే ఇచ్చేశారు. దీనితో ఒకప్పుడు నక్సలిజానికి ఆయువుపట్టుగా ఉన్న తెలంగాణ ఇ ప్పుడు.. నక్సలైట్ అనేవారు లేకుండా అయ్యింది. వందలాది మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసి.. జీవనోపాధి పొందుతున్నారు.

ఆర్టీసీ కార్మికులపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో  నక్సలైట్లతో వ్యవహరించినట్టుగా అణిచివేత ధోరణితో ముందు కు వెల్లడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తెలంగాణ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు.. సమ్మెకు దిగితే.. టెంట్లు, సామా న్లు ఇచ్చే టెంట్‌హౌజ్ యజమానులపై కేసు లు పెట్టడం.. అప్పట్లో నక్సలైట్లతో వ్యవహరించినట్టుగానే ఉంద ని వారంటున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో..

సమైక్య రాష్ట్రం అన్యాయం, అక్రమాలు, పెట్టుబడిదారుల నుంచి రక్షించుకునేందుకు సొంత రాష్ట్ర ఒక్కటే మార్గమని భావించిన తెలంగాణ యావత్తూ ఉవ్వెత్తున ఉద్యమం చేసింది. సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సునుకూడా కదలనీయలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క బస్సునుకూడా తెలంగాణలోకి రానీయలేదు. విద్యుత్తు, సింగరేణి కార్మి కులు, ఉద్యోగులతో పోటీపడిమరీ ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో ఉరకలెత్తారు.

తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం ఎంతో ఉంది. అలాంటి ఆర్టీసీ కార్మికులు చట్టబద్ధం గా, న్యాయబద్ధంగా సమ్మెకు దిగితే.. గతంలో నక్సలైట్లతో ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరించారో.. ఇప్పుడుకూడా అలాగే వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే ప్రజా ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు నక్సలైట్లుగా కనపడుతున్నారా.. లేక.. అర్బన్ నక్సలైట్లుగా కనపడుతున్నారా అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

పైగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని శ్రావణి టెంట్‌హౌజ్ యజమాని ప్రవీణ్‌పై కేసుకూడా నమోదు కావడాన్నిబట్టి చూస్తే.. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దమననీతితో, అణిచివేత ధోరణితో ముందుకు పోతున్నట్టుగా కనపడుతుందని మేధావి వర్గం అనుమానిస్తోంది.

* మహబూబాబాద్ జిల్లా తొ ర్రూరు బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెను పురస్కరించుకొని బుధవారం నుంచి టెం టు వేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తొర్రూరు పట్టణానికి చెందిన శ్రావణి టెంట్‌హౌస్ యజమా ని ప్రవీణ్ చేత టెంట్ వేయించారు. అయితే బుధవారం రాత్రి ఆర్టీసీ సమ్మె దీక్ష శిబిరానికి టెంట్ వేసి మద్దతు తెలిపా డని, ప్రవీణ్‌పై తొర్రూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే దీక్షాశిబిరం వద్ద ఏర్పాటుచేసిన 26 కుర్చీలను స్వాధీ నం చేసుకున్నట్టు బాధితుడు ప్రవీణ్ తెలిపారు. టెంటు వేయ డం నేరమా? అంటూ ప్రశ్నించాడు. టెంట్ తొలగించమని చెబితే, తానే తొలగించే వాడినని అకారణంగా తనపై కేసు నమోదు చేయడం పట్ల ప్రవీణ్  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.