హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : పిసి.ఘోష్ కమిషన్ ఆధారంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి విచారణ చేపట్టారాదని హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
గురువారం మీర్ పేట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి విచారణ చేయరాదని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్ బిఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షు లు రామిడి రాంరెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, దీప్ లాల్ చవాన్, పెద్దబావి శ్రీనివాసరెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, ఆర్కల భూపాల్ రెడ్డి, ఆర్కల కామేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






