పటేల్‌కుంట చెరువును సుందరీకరించండి
24-04-2026 01:24 AM
ఉప్పల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లో ఉన్న పటేల్ కుంట సుందరీకరణ పనులు ప్రారంభించాలని ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి పత్రం అందించారు. నాచారం డివిజన్లోని ఉన్న రెండు చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. హెచ్‌ఎంటి నగర్ పెద్ద చెరువు పటేల్ కుంట సుందరీకరణ పనులను ప్రారంభించారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. దీనిగాను హైడ్రా కమిషనర్ రంగనాథ్ త్వరలోనే సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు






