4 August, 2026 | 1:47 AM

భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం

04-08-2026 12:23 AM

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

ఉప్పల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా హెచ్‌ఎంటీ నగర్ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. జాన్సన్ గ్రామర్ స్కూల్ ముందు వీధితో పాటు ఇందిరానగర్ వీధి నంబర్3లో చేపట్టనున్న పనులకు భూమిపూజ నిర్వహించి అధికారికంగా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడం, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్, డీజీఎం వేణుగోపాల్, మేనేజర్ రోహిత్, స్థానిక నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు. స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.