4 August, 2026 | 2:32 AM

రగులుతున్న రాంచీ

04-08-2026 01:29 AM
  1. ఉవ్వెత్తున జార్ఖండ్‌లో విద్యార్థి ఉద్యమం
  2. ప్రశ్నాపత్రాల లీకేజీపై తిరగబడిన ‘జెన్ జీ’
  3. రాజధానికి వేలాదిగా తరలివచ్చిన యువత
  4. జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్
  5. సీఐడీ విచారణపై నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని పట్టు
  6. విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు

రాంచీ, ఆగస్టు ౩: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్సీ) వరుసగా నిర్వహిస్తు న్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, ప్రభు త్వ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, పరీ క్ష ముందుగానే ఓఎంఆర్ షీట్లు బయటకు రావడంపై రాష్ట్ర యువత భగ్గుమంది. అక్రమాల నిగ్గు తేల్చేందుకు సెంట్రల్ బ్యూ రో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇటీవల జేపీఎ స్సీ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలనే డి మాండ్‌తో జెన్‌జీ యవత సోమవారం రా ష్ట్ర రాజధాని రాంచీలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.

జైపాల్ సింగ్ ముండా స్టేడియం వేదికగా జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా యువతీ యువకులు తరలివచ్చా రు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాల ని, పరీక్షల ఫలితాలు విడుదల చేసే సమయ ంలోనే కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులు, అభ్యర్థుల మార్కులను వెల్లడించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బ్లాక్‌లిస్ట్ ఉన్న లేదా లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఏజెన్సీలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించకూడదని నినదించారు.

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను వేర్వేరు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్‌కు తావు లేకుం డా ‘నోట్ అటెంప్టెడ్’ అనే 5వ ఐచ్ఛికాన్ని చే ర్చాలని డిమాండ్ చేశారు. 2000లో బిహా ర్ నుంచి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ, ప్ర శ్నాపత్రాల లీకేజీ సమస్య వేళ్లూనుకుపోయి ందని, ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందిం చి పోటీ పరీక్షల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకత అమలు చేయాలని కోరారు. పరీక్షల అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణపై త మకు ఏమాత్రం నమ్మ కం లేదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ లోపాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సీజేపీ మద్దతు

విద్యార్థుల నిరసనకు కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) సంపూర్ణ మద్దతు ప్రకటించిం  ది. ఢిల్లీలో ఇటీవల సీజేపీ నేతలు నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ ఉద్యమం రాంచీ వి ద్యార్థుల నిరసనకు ఊపిరూలూదింది. వారి ఉద్యమానికి కేంద్రం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జార్ఖండ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ నిరసన కార్యక్రమం అంతా పూర్తిగా విద్యార్థులే నడిపించడం విశేషం. తమ ఉద్యమాని కి రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వవచ్చని, కానీ.. వారి నాయకత్వాన్ని కోరుకోవ డంలేదని విద్యార్థి కోర్ కమిటీ సభ్యులు వినయ్ మెహతా, పీష్ సింగ్ తేల్చిచెప్పారు.

పెద్దఎత్తున స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు

ఢిల్లీలో సీజేపీ నిరసనకు అనూహ్యమైన మద్దతు లభించినట్టుగానే, ముండా స్టేడియంలో విద్యార్థులు చేపట్టిన నిరసనకూ అనూహ్యమైన స్పందన వచ్చింది. విద్యార్థులు మైదానంలో నిరసన చేపడుతుండగా, వారికి మద్దతుగా వేలాది స్విగ్గీ, జోమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్లు రావడం విశేషం. ఎంతోమంది అపరిచితులు విద్యార్థుల కోసం మైదానికి ఆహారాన్ని చేర్చారు. ఫుడ్ ఆర్డర్లలో ‘మైదానంలో నిరసన తెలుపుతున్న ఏ విద్యార్థికైనా ఈ ఫుడ్ అందించండి’ అని డెలవరీ బాయ్స్‌కు సందేశమివ్వడం గమనార్హం.