19 వేల పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలి
- వెంటనే మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి
- వయోపరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ
- ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా
ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో 19 వేల పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇంది రా పార్క్ చౌరస్తాలో సోమవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో నిరుద్యోగుల మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత కొడంగల్ రవి మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీస్ నోటిఫి కేషన్లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్త్స్ర పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని, 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. తమ డి మాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగార్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు మధు సుధాన్, శ్రీకాంత్ రాథోడ్, విరేశ్, కరుణాకర్, ప్రతాప్, శివ, విక్రమ్ తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.






