నేడు భారీ వర్షాలు
17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ: ఐఎండీ
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూఫాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ ప డే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉంటే క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో సోమవారం వర్షం కురిసింది.






