6 July, 2026 | 2:32 AM

రేవంత్ పాలనలో అప్పులు పెరుగుతున్నాయే తప్పా అభివృద్ధి లేదు!

06-07-2026 01:02 AM

మాజీ మంత్రి రెడ్యానాయక్ విసుర్లు 

మహబూబాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, ఆరు గ్యారెంటీలు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి తప్ప సంక్షేమం కానరావడం లేదని, రైతుల అవసరాల గురించి ఆలోచించాలనే మంచిబుద్ది ఈ.. ప్రభుత్వానికి రావడంలేదని, అడ్డుకున్నంత మాత్రానా, అరెస్ట్ లు చేసినంత మాత్రాన ప్రజాగ్రహాన్ని ఆపలేరని మాజీ మంత్రి డి ఎస్ రెడ్యా నాయక్ అన్నారు.

ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఇప్పటికే ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని, ఆకాశం మీద ఉమ్మి వేయడం మాని..., మీరు చేసిన పనులేమైనా ఉంటే చెప్పండని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం ప్రతిపక్షాల బాధ్యత అని, ఆ బాధ్యతను నెరవేర్చడానికి కేటీఆర్ కన్నేపల్లి పర్యటనకు వస్తే అడుగడుగున అడ్డుకోవడం అధికార పక్షానికి తగదన్నారు.