బుమ్రా ప్రాక్టీస్ షురూ
ఇంగ్లాండ్‌తో వన్డేలకు ప్రిపరేషన్
అహ్మదాబాద్, జూలై 5: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన బుమ్రా ప్రాక్టీస్ ప్రారంభించాడు. అహ్మదాబాద్ గుజరాతీ కాలేజ్ గ్రౌండ్‌లో బుమ్రా ఎర్రబంతితో నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. రాబోయే టెస్ట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా రెడ్‌బాల్‌తో సాధన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమాను లతో పంచుకున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెం ట్ కారణంగా ఐపీఎల్ తర్వాత బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో టీ2 సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేయలేదు. అయి తే వన్డే సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు. ప్ర స్తుతం ఆ వన్డే సిరీస్ కోసం, తర్వాత శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం బుమ్రా ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడు. కాగా ఐపీఎల్ 19వ సీజన్‌లో బుమ్రా కేవలం 4 వికె ట్లు మాత్రమే పడగొట్టాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. అంతకుముం దు టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాం డ్‌తో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది.






