కంగారూలదే కప్పు
ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు
ఆల్‌రౌండ్ షోతో ఆసీస్ అదుర్స్
మూనీ, లిచ్‌ఫీల్డ్ మెరుపులు
ఏడోసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం
తమను ఛాంపియన్ జట్టు అని ఎందుకు పిలుస్తారో ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ను రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో ఉండే ఒత్తిడిని అలవోకగా అధిగమించిన కంగారూలు ఏడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయారు. అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు అన్ని విభాగాల్లో అదరగొట్టింది.
లార్డ్స్, జూలై 5: టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే ఆసీస్ బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు. ఓపెనర్ అమీ జోన్స్ (6) రెండో ఓవర్లోనే లూసీ హామిల్టన్ బౌలింగ్లో ఔటవగా, మరో ఓపెనర్ డానీ వ్యాట్-హోడ్జ్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అనబెల్ సదర్లాండ్ బౌలింగ్‌లో ఆమె పెవిలియన్ చే రింది.ఆ తర్వాత వచ్చిన స్టార్ ప్లేయర్ అలిస్ క్యాప్సే (23) ధాటిగా ఆడే ప్రయత్నంలో సోఫీ మోలినీక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్ అయింది.
సీనియర్ ప్లేయర్ హీదర్ నైట్ (2) కూడా నిరాశపరిచింది. ఈ దశలో నాట్ సీవర్-బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆదుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా బ్రంట్ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అం దించింది. ఆమె 53 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన యువ ప్లేయర్ ఫ్రేయా కెంప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.
ఆమె కేవలం 28 బంతు ల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.కెప్టెన్ సీవర్-బ్రంట్, ఫ్రేయా కెంప్ కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు(150/7) సాధించగలిగింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, హామి ల్టన్, సదర్లాండ్, సోఫీ ఒక్కో నికెట్ పడగొట్టారు. తర్వాత ఛేజింగ్‌లో ఆస్ట్రేలియాకు ఆ రంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వోల్ (9) పరుగులకే ఔటయింది. ఈ దశలో మరో ఓపెనర్ బెత్ మూనీ , లిచ్ ఫీల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
వీరిద్దరూ కేవలం 67 బంతుల్లోనే 100 పరుగు లు జోడించారు. ఈ క్రమంలో మూనీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, లిచ్ ఫీల్ 48 పరుగులకు వెనుదిరిగింది. అటు మూనీ 49 బం తుల్లో 10 ఫోర్లతో 64 పరుగులు చేసి ఔటైనప్పటకీ ఆసీస్ విజయం అప్పటికే ఖాయ మైపోయింది. దీంతో కంగారూలు 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఆసీస్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడం ఇది ఏడోసారి. గతంలో ఆసీస్ 2010, 2012, 2014లో వ రుసగా మూడుసార్లు, 2018, 2020, 2023లో మరోసారి హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు ఏడోసారి పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది.
మరోవైపు 2009లో టైటిల్ గెలిచి రెండో సారి సొంతగడ్డపై ట్రోఫీని ము ద్దాడదాం అనుకున్న ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు. కాగా ఇరు జట్లు ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా ఫైనల్స్‌కు దూసుకొచ్చాయి. ఇది లా ఉంటే మహిళల ప్రపంచకప్‌కు సైతం ఐసీసీ ఈ సారి భారీగా ప్రైజ్‌మనీ పెంచింది. మొత్తం 83 కోట్లు ప్రైజ్‌మనీగా కేటాయించింది. ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌కు రూ.22 కోట్లు, రన్నరప్ ఇంగ్లాండ్‌కు రూ.11 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. అలాగే సెమీస్ వరకు వచ్చిన ఒక్కో జట్టుకు రూ.6.5 కోట్లు నజరానాగా దక్కింది.
స్కోరు బోర్డు
ఇంగ్లాండ్ మహిళల జట్టు : 150/4 (సీవర్ బ్రంట్ 58, ఫ్రియా కెంప్ 44, క్యాప్సీ 23; గార్త్ 1/20, హామిల్టన్ 1/19, సదర్లాండ్ 1/34)
ఆస్ట్రేలియా మహిళల జట్టు : 153/3 ( బెత్ మూనీ 64, లిచ్‌ఫీల్డ్ 48, పెర్రీ 13 నాటౌట్; డీన్ 1/28, సోఫియా 1/24 , లారెన్ బెల్ 1/38)
ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జాబితా
2010 చాంపియన్
2012 చాంపియన్
2014 చాంపియన్
2016 రన్నరప్
2018 చాంపియన్
2020 చాంపియన్
2023 చాంపియన్
2026 చాంపియన్






