6 July, 2026 | 3:19 AM

చొరవ తీసుకోండి

06-07-2026 02:07 AM
  1. మెట్రో రైల్ ఫేజ్ తక్షణమే ఆమోదం ఇవ్వండి
  2. ఫేజ్ తెలంగాణకు అప్పగించండి
  3. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
  4. మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి 
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరో లేఖలో సీఎం వినతి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మెట్రో రైల్ ఫేజ్ -2 నిర్మాణం పై వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని, వెంటనే ఆమోదం ఇవ్వాలని కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఎస్‌బీఐ క్యాప్స్‌ను  తక్షణమే నియమించాలని, ఒకవేళ ఆలస్యమైతే, ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదముందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరో లేఖలో విన్నవించారు.

మనోహర్ లాల్ ఖట్టర్‌కు రాసిన లేఖలో ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం అమలులో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్ తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు.

ఆలస్యం చేయడం వల్ల ప్రాజెక్టు అమలు దెబ్బతింటుందని, వ్యయం కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని లేఖల్లో ప్రత్యేకంగా వివరించారు. గత నెల జూన్ 24వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో పాల్గొన్న సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా గుర్తు చేశా రు. ఆ సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికీ అమలులోకి రాకపోవడం పట్ల సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎస్‌బీఐ క్యాప్స్‌నకు కీలక బాధ్యతలు అప్పగించాలి..

జూన్ 24న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్బీఐ క్యాప్స్)కు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన వంటి కీలక బాధ్యతలు అప్పగించాలని అంగీకరించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ఫేజ్-1పై ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే (రిఫైనాన్సింగ్) అవకాశాలను కూడా ఎస్బీఐ క్యాప్స్ పరిశీలించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఎస్బీఐ క్యాప్స్‌నకు బాధ్యతలు అప్ప గించాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు ఆ సంస్థను అధికారికంగా నియమించలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియలో అనిశ్చితి నెలకొనడంతో పాటు రోజు వారీ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎస్బీఐ క్యాప్స్ నియామ కం ఆలస్యం కావడం వల్ల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (డీపీఆర్‌లు) కేంద్ర అనుమతులు రావడం మరింత ఆలస్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ కూడా ముందుకు సాగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వాపోయారు. 

ఫేజ్ సమగ్ర ఆర్థిక వ్యూహం అవసరం..

మెట్రో ఫేజ్ భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయని, అందువల్ల  ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, నిధుల సమీకరణ మార్గాలు, ఆర్థిక వ్యూహం కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం వివరించారు. ఫేజ్‌హా ప్రాజెక్టు విలువ నిర్ధారణ, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2 నిధుల సమీకరణ వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించేలా టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియ సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిందని కూడా లేఖలో గుర్తు చేశారు.

మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది 

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయనకు రాసిన లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఇకపై మరింత ఆలస్యం కాకుండా చూడాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి, పెండింగ్‌లో  ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని సీఎం వివరించారు.

పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, విస్తరిస్తున్న నగర పరిధి, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో విస్తరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఫేజ్-1 తెలంగాణ ప్ర భుత్వానికి బదిలీ కాగా, ఫేజ్-2 వేగంగా అ మలైతే నగర ప్రజారవాణా వ్యవస్థ మరిం త బలోపేతం అవుతుందని, హైదరాబాద్ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని తెలిపారు.  సంబంధిత శాఖలతో సమన్వ యం చేయాలని, ఎస్బీఐ క్యాప్స్‌ను  తక్షణమే నియమించి టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ను ఖరారు చేయించాలని సీఎం  చేశారు. అలా జరిగితే మెట్రో ఫేజ్-1 బదిలీ ప్రక్రియ వేగంగా పూర్తవడంతో పాటు, ఫేజ్-2 విస్తరణ పనులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభమవుతాయని  ఆశాభావం వ్యక్తం చేశారు.