6 July, 2026 | 2:32 AM

డంపింగ్ యార్డ్ పోరాటంలో అందరూ భాగస్వాములవ్వండి

06-07-2026 01:02 AM
  1. అహ్మద్ గూడ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సమావేశం                            
  2. జవహర్ నగర్ డంపింగ్‌యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి                            

జవహర్ నగర్, జూలై 5 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత గురించి జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని తద్వారా డంపింగ్ భూతాన్ని దూరంగా పార ద్రోలాలని  జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చైర్మన్ షేక్షావలి మాట్లాడుతూ జవహర్ నగర్ రాంకీ చెత్త డంపింగ్ యార్డ్ తొలగింపుకై జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని,

డంపింగ్ యార్డ్ ను బేషరతుగా ఎత్తివేసి శాస్త్రీయమైన పద్ధతిలో కలుషితమైన భూమి నీరు గాలిని శుద్ధి చేయాలని ఆరోగ్య భద్రత,పర్యావరణ పరిరక్షణ భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే చెత్త రవాణాను దుర్వాసనను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఆర్. నరసింహ గౌడ్, కన్వీనర్లు పి. సునీత, సిపిఐ తోటపల్లి శంకర్, సిపిఎం టి. శివన్నారాయణ, డబుల్ బెడ్ రూమ్ కాలనీ డైరెక్టర్లు విజయ్ కుమార్, రమణ, సంధ్య, నాగరాజు, వెంకటేష్, షమీనా, ఖదీర్, డబల్ బెడ్ రూమ్ వాసులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.