6 July, 2026 | 2:49 AM

డబుల్ ట్యాక్స్ మాయాజాలం!

06-07-2026 01:38 AM
  1. పింక్ నోటీసుల వెనుక బ్లాక్ దందా?
  2. జీహెచ్‌ఎంసీలో కాసుల వేట
  3. భాగ్యనగరంలో టౌన్ ప్లానింగ్ మాఫియా
  4. అక్రమాలకు కేరాఫ్‌గా పటాన్‌చెరు (ఎ.చంద్రశేఖర్ రావు)

సంగారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో అనుమతి లేని బహుళ అం తస్తులు, అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ విధిస్తున్న 100 శాతం ఫెనాల్టీ (డబుల్ ట్యాక్స్) వసూళ్లు నగరవాసులకు పెను భా రంగా మారాయి. భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జీహె చ్‌ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 220ఏ ప్రకారం ఆస్తి పన్నుపై అదనంగా 25 నుంచి 100 శాతం వరకు జరిమానా విధిస్తున్నారు.

అయితే, ఈ జరి మానా వసూలు కేవలం ప్రభు త్వ ఆదాయ వనరుగా మారిందే తప్ప అక్రమ నిర్మాణాల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతోం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా నిర్మిం చిన అంతస్తులు, సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉన్న భవనాలకు సాధారణ ఆస్తి పన్నుతో పాటు సమానమైన (100 శాతం) జరిమానా విధిస్తున్నారు. దీనివల్ల యజమాను లు ఏటా రెట్టింపు పన్ను (డబుల్ ట్యాక్స్) కట్టాల్సి వస్తోంది.

నగరంలో చాలా చోట్ల జీ+1 లేదా జీ+2 అనుమతులు తీసుకుని, ఆపై యథేచ్ఛగా 5 నుంచి 8 అంతస్తుల వర కు నిర్మిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, మలక్‌పేట్, చందానగర్, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఉల్లంఘనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై డబుల్ ట్యాక్స్ వసూలు చేసినంత మాత్రాన ఆ భవనాలకు చట్టబద్ధత గానీ, యాజమాన్య హ క్కులు గానీ లభించవని జీహెచ్‌ఎంసీ జీఓ 299 స్పష్టం చేస్తోంది.

జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా నిర్వహించిన క్షేత్రస్థాయి జియో-ట్యా గింగ్ సర్వే ప్రకారం నగరంలో ప్లాన్ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించిన భవనాలు 1.04 లక్షలకు పైగా ఉన్నట్లు రికార్డులు తేల్చాయి. ఈ గుర్తించిన లక్షకు పైగా ఆస్తులలో, మున్సిపల్ యంత్రాంగం వివిధ దశలలో మొదట దాదాపు 5,140 భారీ ఉల్లంఘనలు ఉన్న ప్రాజెక్టులను నేరుగా ‘పింక్ రశీదు’ (ఫారమ్-2, 3) పరిధిలోకి తెచ్చి 100 శాతం జరిమా నాతో కూడిన డబుల్ ట్యాక్స్ నెట్లోకి చేర్చిం ది. 

ఏటా జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 1,500 కొత్త అక్రమ లేదా నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలను అధికారులు గుర్తిస్తున్నారు. వీటిలో దాదాపు 1,000 వరకు భవనాలపై పాక్షిక కూల్చివేతలు లేదా సీజ్ నోటీసులు జారీ అవుతుండగా, మిగిలిన వాటికి డబుల్ ట్యాక్స్ పెనాల్టీలు విధిస్తు న్నారు. నగరంలో నమోదవుతున్న మొత్తం అక్రమ నిర్మాణాల కేసులలో దాదాపు 40 శాతం ఐటీ కారిడార్ పరిధిలోనే (శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చందానగర్, మాదాపూర్) ఉన్నాయి.

పింక్ రశీదుతో ‘డబుల్’ వసూళ్లు

భవన యజమాని ప్రభుత్వ అనుమతి లేకుండా లేదా ప్లాన్ దాటి అదనపు అంతస్తులు కట్టినప్పుడు ఈ రశీదు ఇస్తారు. సాధా రణ చట్టబద్ధమైన ఇళ్లకు తెల్లటి రశీదులు ఇస్తే, అక్రమ కట్టడాలను సులువుగా గుర్తించడానికి వీలుగా రికార్డులను, డిమాండ్ నోటీసులను గులాబీ రంగులోనే నిర్వహిస్తారు. పింక్ రశీదులపై యజమాని పేరు స్థానంలో కేవలం ‘భవన సంరక్షకుడు‘ అని మాత్రమే రాస్తారు. దీనివల్ల సదరు వ్యక్తికి ఆ భవనంపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు లేవని అర్థం.

ప్రభుత్వం ఈ పింక్ రశీదులను అక్రమ కట్టడాలను శిక్షించడానికి, నియంత్రించడానికి ప్రవేశపెట్టింది. కానీ క్షేత్రస్థాయి లో ఇది కొందరు అధికారులు, స్థానిక రాజకీయ నేతలకు కాసుల కురిపించే సాధనంగా మారింది. ‘మేము ప్రభుత్వానికి డబుల్ ట్యాక్స్ కడుతున్నాం, మాకు పింక్ రశీదు ఉంది, కాబట్టి మా ఇల్లు సేఫ్’ అని భవన యజమానులను నమ్మిస్తున్నారు. కానీ పన్ను కట్టినంత మాత్రాన ఆ అక్రమ నిర్మాణానికి ఎలాంటి చట్టబద్ధత రాదు అని చట్టం స్పష్టం చేస్తోంది.

మరోవైపు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ‘మీకు పింక్ నోటీసు వచ్చింది, బిల్డింగ్ కూల్చేస్తాం‘ అని భయపెట్టి, ఆ నోటీసు ఆపడానికి లేదా పెనాల్టీ తగ్గించడానికి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది బిల్డర్లు అదనపు అంతస్తులు కట్టేసి, పింక్ రశీదులను చూపిస్తూ ‘ఇదిగో టాక్స్ కూడా కడుతున్నాం, అంతా సవ్యంగానే ఉంది‘ అని అమాయక కొనుగోలుదారులకు ఆ ఫ్లాట్లను అంటగడుతున్నారు.

తీరా కొన్నాక కానీ బాధితులకు అది అక్రమ నిర్మాణమని తెలియడం లేదు. అక్రమ నిర్మాణాల విక్రయా లను అడ్డుకునేందుకు, అటువంటి ఆస్తుల ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) పై ‘అనధికార నిర్మాణం‘ అని స్పష్టంగా నమోదు చేసే విధానాన్ని అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. 

అక్రమాలకు కేరాఫ్ పటాన్‌చెరు

ఉమ్మడి మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు అత్యంత కీలకమైన సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో ‘డబుల్ ట్యాక్స్’ పేరిట అడ్డగోలు వసూళ్ల పర్వం నడుస్తోంది. ఐటీ కారిడార్కు ఆనుకుని ఉండటం, పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తుండటంతో ఇక్కడ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

జీ హెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్చెరు, ఆమీన్పూర్, తెల్లాపూర్, రామచంద్రాపురం సర్కిళ్లతో పాటు, సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక రాజకీయ దళారులు కలిసి ఈ ’డబుల్ ట్యాక్స్’ (పింక్ రశీదుల) దందాను ఒక వ్యవస్థీకృత మాఫియాగా మార్చేశారు. ముఖ్యం గా పటాన్చెరు ప్రాంతంలో చెరువుల శిఖం భూములు, నాలాలు, వాటి బఫర్ జోన్లను సైతం ఆక్రమించి జీ+5, జీ+8 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే పటాన్చెరు సర్కిల్ పరిధిలో ఒక బడా బిల్డర్ నాలాను 3 మీటర్లు ఆక్రమించి నిర్మాణం జరిపిన ఉదంతం బయటపడింది.

ఇలాంటి భారీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ‘పింక్ నోటీసుల’ భయం చూపిస్తున్నారు. ప్రభుత్వానికి 100 శాతం పెనాల్టీ డబుల్ ట్యాక్స్ పడకుండా మేనేజ్ చేస్తామని, ప్లాన్ డివియేషన్లను చూసీచూడనట్లు వదిలేస్తామని ఒక్కో అంతస్తుకు లక్షల రూపాయల లంచాలు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు విధిస్తున్న డబుల్ ట్యాక్స్ పెనాల్టీ భారం తట్టుకోలేక, ఆ నోటీసులు రద్దు చేయించుకోవడానికి సామా న్యులు టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరుగుతూ దళారులకు అడిగినంత సమర్పించుకుంటున్నారు.