బీసీ సమరభేరి
దొరల గడీలు బద్దలు కొడతాం.. ఇక రెడ్లకు, వెలమలకు కౌంట్ డౌన్ స్టార్ట్
- ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సవరణ చేసి భూములు పంచుతాం
- ఉన్నతవర్గాల ఎమ్మెల్యేలను రాజకీయ సమాధి చేయాలి
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- రాజకీయవర్గాల్లో బాంబు మల్లన్న: మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
- వచ్చే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్ననే ముఖ్యమంత్రి
- ఎంబీటీ అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్
- భువనగిరిలో రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభ
- ఆకట్టుకున్న బెల్లి లలిత, మారోజు వీరన్న, కొండా లక్ష్మణ్, గద్దర్, కొనపురి సాంబశివుడు, చాకలి ఐలమ్మ ఏఐ స్పీచ్‌లు
- ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్పీలోకి డా. భిక్షపతి
- సభకు అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ వెంకట్ మహారాజ్
రాబోయే 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్లలో బీసీ సీఎం
తెలంగాణలో 3 కోట్ల 54 లక్షల బీసీ జనాభా ఉంటే, 42 వేలు ఉన్న వెలమలు, 17 లక్షలు ఉన్న రెడ్లు ముఖ్యమంత్రి పీఠాలు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. 30 లక్షల మంది ఉన్న ముదిరాజ్‌లు మాత్రం మంత్రి పదవి కోసం దశాబ్దాలుగా ఎదురుచూడాల్సిన దుస్థితి. రాష్ర్టంలో ఉన్న 59 మంది రెడ్డి, వెలమ, కమ్మ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొందపెడుతాం. నల్లగొండ జిల్లాలోని రెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రులను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం.
తీన్మార్ మల్లన్న
యాదాద్రి భువనగిరి/చిట్యాల, జూలై 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 మంది రెడ్డి, వెలమ, కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సర్జికల్ స్ట్రైక్ నిర్వహించబోతుందని, రాబో యే ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీదేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. దొరల గడీలను బద్దలు కొడతామని, రెడ్లకు, వెలమలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సవరణ చేసి భూములు పంచుతామని, తెలంగాణలో భూముల పంపకాలపై నిజాం రాసిన కీలక డాక్యుమెంటును త్వరలో బయటపెడతామని వెల్లడించారు. బీసీల ప్రభంజనాన్ని ఎవ్వడు ఆపలేడని, ఉన్నత వర్గాల ఎమ్మెల్యేలను రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్లలో తెలంగాణకు బీసీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీసీలకు దక్కాల్సిన 42 శాతం ఉద్యోగాల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. అమెరికాలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ ఎన్‌ఆర్‌ఐలు ఏకం కావాలని, తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారం రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాం కాలంలో నిజాం రాజు వెళ్తూ వెళ్తూ ఇక్కడి భూములను పేద ప్రజలకు పంచాలని తీర్మానం చేసి వెళ్లాడని, కానీ దానిని కొండా వెంకటరంగారెడ్డి దాచిపెట్టి, 1954 రికార్డులను తారుమారు చేసి పేదలకు పంచాల్సిన భూములను దొరల పేరున ఎక్కించి దోచుకున్నారని ఆరోపించారు.
పేదలకు దక్కాల్సిన భూములను అధి కారం సాధించి కొట్లాడి మన భూములను మనం తిరిగి పొందాలని పేర్కొన్నారు. భువనగిరి నుంచి బీసీలమందరం ఏకమై రాష్ట్ర మంతా ఆ కాగితాన్ని తీసుకొని దొరల భూ ములు పేదలకి దక్కేలా చేద్దామన్నారు. ఇటీవలే సూర్యపేట జిల్లాలోని నూతనకల్ లో దొరల భూములు పేదలకు పంచినట్టు చె ప్పారు.
1948లో నిజాం నవాబు తెలంగాణలోని భూములను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాసిస్తూ ఒక కాగితం ఇచ్చి వెళితే, అప్పటి రెవెన్యూ మంత్రి కొండా వెంకట రంగారెడ్డి (ప్రస్తుత ఎంపీ చేవెళ్ల విశ్వేశ్వర్ రెడ్డి తాత) ఆ కాగితాలను చింపేసి దాచిపెట్టారని, ఆ భూములను దొరల పేర్ల మీదకు మార్చారని మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. పి.వి. నరసింహారావు ల్యాండ్ సీలింగ్ చట్టా న్ని తెచ్చినప్పుడు రెడ్లు అడ్డుకుంటే, ముదిరాజ్ బిడ్డ జగన్నాథరావు ఆ బిల్లు పాస్ చేయించారని గుర్తుచేశారు. దొరల చేతుల్లో ఉన్న ఆ పురంబోకు, ఇనాం భూ ములను గుంజుకొని తిరిగి పేదలకు పంచడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమన్నారు.
అనేక ఏళ్లుగా వారేనా ఎమ్మెల్యేలు?
తెలంగాణలో 3 కోట్ల 54 లక్షల బీసీ జనాభా ఉంటే, కేవలం 42 వేలు ఉన్న వెలమలు, 17 లక్షలు ఉన్న రెడ్లు ముఖ్యమంత్రి పీఠాలు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారని మల్లన్న గణాంకాలతో సహా పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటిన్నర లక్షల మంది సూదరోళ్లు ఉన్నారని, కేవలం 19 వేల మం ది ఉన్న రెడ్లే పెత్తనం చెలాయిస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న విమర్శించారు. గజ్వేల్‌లో 481 మంది వెలమ ఓటర్లు ఉండగా ముఖ్యమంత్రి కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయ్యాడని చెప్పారు.
30 లక్షల మంది ముదిరాజ్‌లు ఉన్న రాష్ట్రంలో వారికి ఓ మంత్రి పదవి లేకపోవడం దారు ణం అన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు భువనగిరి, మునుగోడు, నల్లగొండ, మిర్యాలగూడ ని యోజకవర్గాలతో పాటు పలుచోట్ల గత 57 నుంచి 65 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారన్నారు. ఈసారి నల్లగొండ రెడ్డి ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా దా టనియ్యబోమని సవాల్ చేశారు. బీసీ ప్రజలంతా ఏకమై మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే అనే నినాదంతో ముందుకు రావాలని పలిపునిచ్చారు. 403 వెలమ ఓట్లు ఉన్న సిద్దిపేటలో హరీశ్‌రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, అధిక సంఖ్యలో ఉన్న బీసీలు మాత్రం రాష్ట్రంలో 19 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని తెలిపారు.
బీసీలు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారని, ఉన్నత స్థానాల ను అధిరోహించలేకపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 రెడ్డి వెలమ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్నారు. వారంతవారే మర్యాదగా వెళ్లాలని, లేదంటే బీసీలు ఏకమై మెడలు బట్టి బయటకి నెట్టుతారని హెచ్చరించారు. బీసీ ముఖ్య మంత్రికి ఇంకా 884 రోజుల ఐదు గంటల రెండు నిమిషాల మూడు సెకండ్లు మాత్రమే సమయం ఉందని జోస్యం చెప్పారు.
రెడ్లు, వెలమల పతనాన్ని ఎవ్వడు ఆపలేరని ఎక్క డి నుంచి వచ్చారు అక్కడికే వెళ్లిపోవాలన్నా రు. రాయగిరి రైతుల కన్నీళ్లను టీఆర్పీ తప్పక తుడుస్తుందని మల్లన్న అన్నారు. బీ సీల రాజ్యాధికార సాధనకు బీసీలందర్నీ యుద్ధం చేసేందుకు ఆహ్వానిస్తున్నట్టు ఆయ న తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నరసింహులు, మామిడి అంజయ్య పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
అంతకు ముందు సభకు ముఖ్య అతిథులుగా హాజరైన బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు దేవల్ల సమ్మయ్య, ఎంబీటీ పార్టీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరిన డాక్టర్ భిక్షపతి, సభ కోసం అమెరియా నుంచి వచ్చిన వెంకట మారోజు మాట్లాడారు. సమ్మయ్య మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బీసీలు వెనకబడి పోవడానికి కారణం రాజ్యాధికారం లేకపోవడమే అని అన్నారు. బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే బీసీల బ్రతుకులు మారుతాయని, యువతకు సరై న ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. అధికారంలోకిచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఆర్టీసీ కార్మికులను మోసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సభలో ఆకట్టుకున్న ప్రముఖుల ఏఐ వీడియోలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన సభలో ప్రముఖుల ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెల్లి లలిత, సాంబశివుడు, మా రోజు వీరన్న, గద్దర్, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర ప్రముఖులు మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఏఐ వీడియోలను సభలో ప్రదర్శించారు. ఈ వీడియోల్లో రాబోయేది బీసీ రాజ్యాధికారమే, బీసీలంతా మల్లన్న బాటలో నడవాలి, బీసీని ముఖ్యమంత్రిగా చేసి రాజ్యాధికారం సాధించాలి అనే సందేశాలను ప్రతిబింబించారు. ఈ ఏఐ వీడియోలు సభకు హాజరైన ప్రజలను విశేషంగా ఆకట్టుకుని, సభలో ప్రత్యేక చర్చకు దారితీశాయి.
టీఆర్పీలోకి పలువురు మేధావులు
సమరభేరి సభలో పలువురు మేధావులు బీసీల ఉద్యమంలోకి ప్రవేశించారు. వీరిలో డాక్టర్ భిక్షపతి ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 3.54 కోట్ల తెలంగాణ జనాభాలో కేవలం 1.42 లక్షల వెలమలు, 17 లక్షల మంది రెడ్డిలు ఉండి పెత్తనాలు చేస్తున్నారన్నారు. ఇది చూసైనా బీసీలంతా ఐక్యం కావలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ డాక్టర్‌గా చేస్తూ బీసీల కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి మల్లన్న వెంట నడవా లని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ భిక్షపతి అ న్నారు.
ఈ సందర్భంగా సభ వేదిక నుండి తన రాజీనామా ప్రకటించి పార్టీలో చేరారు. బీసీల కోసం నిరంతరం కోట్లాడుతున్న మల్లన్నకు తోడుగా బీసీ రాజ్యం స్థాపన చేసే వర కు ఆయన వెంట నా ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. అలాగే మాజీ నక్సలైట్ పిట్టల శంకరన్న సైతం పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ.. అదేవిధంగా పటేల్ వనజమ్మ సీతక్క కంటే సీనియర్ నక్సలైట్ అని 20 ఏళ్లు అడవిలో ఉంటూ ప్రజలకు అండగా నిలిచిందని, ప్రస్తుతం ఆమె సేవలను అందించేందుకు బయటకి వచ్చిందని న్నారు. వీరితో పాటు వెంకట్ మహారాజ్ అనే వ్యక్తి అమెరికా నుంచి సభకు వచ్చి బీసీల ఉద్యమంపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
రాజకీయ వర్గాల్లో బాంబు మల్లన్న: పూర్ణచందర్‌రావు
తెలంగాణలో రాజకీయ వర్గాల్లో బాం బు మల్లన్న అని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు రాజకీయంగా ఐక్యమైతేనే రాజకీయ అధికారం సాధ్యమవుతుం దని, సామాజిక న్యాయం కోసం విశ్వసనీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవ సరమని అన్నారు. రాజ్యాధికార సమరభేరి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో బీసీల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకగా తీన్మార్ మల్ల న్న ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ టెలివిజన్ వేదికగా ప్రజల్లో గుర్తింపు పొం దిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థానాలకు చేరుకున్నట్లే, తీన్మార్ మల్లన్న కూడా ప్రజా సమస్యలను నిరంతరం మీడి యా ద్వారా ప్రస్తావిస్తూ ప్రజల మద్దతు సంపాదించారని అన్నారు.
ఆయన నాయకత్వంలో తెలంగాణలో రాజకీయ మార్పు తప్పదనే ఆశాభావం వ్యక్తం చేశారు. రా ష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు న్యా యం చేయడంలో విఫలమయ్యాయని పూర్ణచంద్రరావు ఆరోపించారు. 119 మం ది సభ్యులతో కూడిన తెలంగాణ శాసనసభలో బీసీలకు వారి జనాభాకు అనుగు ణంగా ప్రాతినిధ్యం లేదని, అలాగే ముస్లింలకూ జనాభా నిష్పత్తి ప్రకారం శాసనస భలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్పీ చేపట్టిన బీసీ సాధికారత ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, తీన్మార్ మల్లన్నతో కలిసి బహుజన రాజకీయ సాధికారత కోసం కృషి చేస్తానని పూర్ణచంద్రరావు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మల్లన్న సీఎం: అంజద్ ఉల్లా ఖాన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవుతారని ఎంబీటీ అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ అన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో కేవలం మహమ్మద్ అలీకి మాత్రమే పదవులు ఇచ్చారని మిగిలిన మైనార్టీలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు.
మైనార్టీల కోసం మల్లన్న తన గొంతుకను వినిపిస్తున్నాడని చెప్పారు. 60 శాతం బీసీలు, 20 శాతం మైనార్టీలు ఉన్న రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్లే అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ బీసీలదేనని, ఖచ్చితంగా దానిపై వారే కూర్చోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న సీఎం తప్పక అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు స్వస్తిపలికి ఎంబీటీ, టీఆర్పీలు కలిసి తీన్మార్ మల్లన్నను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం ఖాయమని చెప్పారు.






